‘చిదంబరం భార్య నళిని గారితో రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారు’ అని చెప్తూ ఒక ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

క్లెయిమ్: ఫోటోలో రామోజీరావు మరియు భువనేశ్వరి తో ఉన్నది చిదంబరం భార్య నళిని
ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్నది నళిని కాదు అని, అక్కడ ఉన్నది తనేనని ‘వనజ చల్లగుల్ల’ అనే టీడీపీ కార్యకర్త ఒకరు ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. నారా లోకేష్ కూడా ఆ ట్వీట్ ని రీ-ట్వీట్ చేసారు. అంతేకాదు, చిదంబరం భార్య నళిని యొక్క మిగితా ఫోటోలు చూసినా, ఫోటోలో ఉన్నది నళిని కాదు అని తెలుస్తుంది. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ లో సెర్చ్ చేయగా, ఆ ఫోటోలో ఉన్నది నళిని కాదు అని ఉన్న ఒక ట్వీట్ ని నారా లోకేష్ రీ-ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. రీ-ట్వీట్ చేసిన ట్వీట్ చూస్తే, ఆ ఫోటోలో ఉన్నది చిదంబరం భార్య నళిని కాదు అని, ఫోటోలో రామోజీ రావు మరియు భువనేశ్వరి తో ఉన్నది తనేనని ‘వనజ చల్లగుల్ల’ అనే టీడీపీ కార్యకర్త ట్వీట్ చేసినట్టు చూడవచ్చు.
FAKE ALERT!!
— Lokesh Nara (@naralokesh) August 22, 2019
JAFFAS CAUGHT AGAIN!
PayTM Batch members didn’t know they can fool all the people sometimes, but not all the times!
😄😆😅😂🤣#FekuJagan #FekuJaffas https://t.co/ijhRPEu0kc
గూగుల్ లో ‘నళిని చిదంబరం’ ఫోటోల కోసం వెతకగా, చాలా ఫోటోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ఆ ఫోటోలు చూసినా, పోస్ట్ లోని ఫోటోలో ఉన్నది నళిని చిదంబరం కాదని తెలుస్తుంది.

చివరగా, ఫోటోలో రామోజీరావు మరియు భువనేశ్వరి తో ఉన్నది చిదంబరం భార్య నళిని కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?