చాలామంది ఫేస్బుక్ యూజర్స్ ఒక వీడియోని పోస్ట్ చేసి గుజరాత్ లో దళిత యువకుడి పై ఒక MLA మరియు అతని అనుచరులు దాడి చేశారు అంటూ అందులో పేర్కొన్నారు. దాంట్లో ఎంతవరకు నిజముందో ఓసారి విశ్లేషిద్దాం.

క్లెయిమ్ (దావా): గుజరాత్ లో దళిత యువకుడు కార్ కొనుక్కొని రోడ్డుపై తిరగటం సహించలేక అనిల్ ఉపాధ్యాయ అనే MLA మరియు అతని అనుచరులు ఆ వ్యక్తి పై దాడి చేశారు.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో పెట్టిన వీడియో గుజరాత్ లో ఒక కుటుంబంలోని సభ్యుల మధ్య జరిగిన గొడవకి సంబంధించినది. గుజరాత్ MLA మరియు అతని అనుచరులు దళిత యువకుడిని కొడ్తున్నారు అనే ఆరోపణలో నిజం లేదు.
పోస్ట్ లోని వీడియో కోసం యూట్యూబ్ లో “Man beaten on road in Gujarat” అనే కీవర్డ్స్ తో వెతికినప్పుడు V6 వార్తా ఛానెల్ వారి న్యూస్ బులెటిన్ లో టెలికాస్ట్ చేసిన ఇదే వీడియో లభించింది. ఆ కథనం ఆధారంగా, గుజరాత్ లోని ఒక కుటుంబం లో అల్లుడు అధిక కట్నం అడిగినందుకు గాను అతని మామ మరియు ఇతర బంధువులు ఆ వ్యక్తిని రోడ్డు పై కొట్టి అతని కార్ ని ధ్వంసం చేశారు అని తెలిసింది.

చివరగా, పోస్ట్ లో పెట్టిన వీడియో గుజరాత్ లో ఒక కుటుంబంలోని సభ్యుల మధ్య జరిగిన గొడవకి సంబంధించినది.