Fake News, Telugu
 

“ఆర్మీ కి కూడా తెలియకుండ UPA హయాం లో సర్జికల్ స్ట్రైక్ లు జరిగాయి” అని రాహుల్ గాంధీ అన్నాడని ట్వీట్ చేసింది ఒక పేరడీ అకౌంట్

0

రాహుల్ గాంధీ సర్జికల్ స్ట్రయిక్స్ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ కూడా భారత ఆర్మీ మరియు వాయుసేన కి తెలీకుండా సర్జికల్ స్ట్రయిక్స్ చేసిందని చెప్పాడని ఫేస్బుక్ లో చాలా పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. ఆ పోస్ట్ లో ఎంత వరకు నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం

క్లెయిమ్ (దావా): రాహుల్ గాంధీ : ‘ యు.పీ.ఏ ప్రభుత్వం కూడా సర్జికల్ స్ట్రయిక్స్ మరియు ఎయిర్ స్ట్రయిక్స్ చేయించింది కానీ అవి ప్రజలకు బహిర్గతం చేయలేదు. చివరికి భారత ఆర్మీ మరియు వాయు సేనకి కూడా.’

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో చేపినట్టుగా భారత ఆర్మీ మరియు వాయు సేనకి కూడా తెలీకుండా సర్జికల్ స్ట్రయిక్స్ చేసామని రాహుల్ గాంధీ అనలేదు. ట్విట్టర్ లో అలా పోస్ట్ చేసింది ఒక పేరడీ అకౌంట్.

 

గూగుల్ లో రాహుల్ గాంధీ చేసిన వాఖ్యాలను సెర్చ్ చేస్తే అది ‘Limes of India’ అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా మొదటిగా పోస్ట్ చేయబడినదని తెలుస్తుంది. ఆ అకౌంట్ గురుంచి వివరణలో  తాము కేవలం వ్యంగ్యపు పోస్టులు, ఫేక్ పోస్టులు పెడతామని చెప్పారు. అదే కాకుండా 100% ట్వీట్ చేసేవన్నీ ఫేక్ పోస్టులు అని వివరణ లో రాసారు. కావున రాహుల్ గాంధీ పైన చెప్పిన విధంగా అన్నాడని వాళ్ళు చేసిన ట్వీట్ ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.   

కానీ నిజంగానే రాహుల్ గాంధీ యు.పీ.ఏ ప్రభుత్వం కూడా సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది కానీ వాటిని బహిర్గతం చేయలేదని అన్నాడు. రాజస్తాన్ ఎన్నికల సమయం లో ఆ వాఖ్యలు చేసారని హిందూస్తాన్ టైమ్స్ ఒక ఆర్టికల్ ని ప్రచురించింది. కానీ ఫేస్బుక్ పోస్ట్ లో చెప్పినట్టుగా ఆర్మీ మరియు వాయు సేనకి కూడా తెలీకుండా చేసామని రాహుల్ గాంధీ అనలేదు. చివరగా, రాహుల్ గాంధీ చేసిన వాఖ్యాలకు కొంత వ్యంగ్యం జోడించి పేరడీ అకౌంట్ చేసిన ట్వీట్ ని ఫేస్బుక్ లో నిజమని షేర్ చేస్తున్నారు.

 

Share.

About Author

Comments are closed.

scroll