Fake News, Telugu
 

అది చర్చి కమిటీ సభ్యత్వం గురించి చర్చి పాస్టర్ కీ, వేరే వ్యక్తికి మధ్య జరిగిన గొడవ కి సంబంధించిన వీడియో

0

పాస్టర్ అత్యాచారం చేసినందుకు చర్చి లో అతన్ని ఒక వ్యక్తి కొడుతున్నాడంటూ వీడియోతో కూడిన పోస్ట్ ని చాలా మంది ఫేస్బుక్ యూజర్స్ షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంత వరకు నిజముందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): తన తల్లి ఓంటరిగా చర్చికి వచ్చి ప్రార్ధన చేస్తున్న సమయంలో పాస్టర్ వచ్చి అత్యాచారం చేసినందుకు ఆమె కొడుకు కొట్టాడు.

ఫాక్ట్ (నిజం): చర్చి పాస్టర్ ఆనంద్ రావు, చర్చి కమిటీ నుండి వెలివేయబడ్డ శాంత కుమార్ అనే వ్యక్తి ని తిరిగి కమిటీ లోకి తీసుకోవడాన్ని నిరాకరించడంతో అతనిపై ఆ వ్యక్తి దాడి చేసాడు. కావున పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో నిజం లేదు.

యూట్యూబ్ లో “Church father beaten in Telugu states” అని వెతికినప్పుడు, TV9 వారు తమ ఛానల్ లో ఈ విషయం గురించి ప్రసారం చేసిన న్యూస్ వీడియో లభించింది. దీని ప్రకారం, భద్రాద్రి కోతగూడెంలో ఉన్న ఒక చర్చిలో, కొత్తగా ఎన్నికైన పాస్టర్ ఆనంద్ రావు, తమ చర్చి కమిటీలోకి అంతకుముందు వెలివేయబడ్డ శాంత కుమార్ అనే వ్యక్తిని  తిరిగి కమిటీలోకి  చేర్చుకోవడాన్ని నిరాకరించడంతో అతని పై ఆ వ్యక్తి దాడికి దిగాడు అని తెలిసింది.

చివరగా, ఆ వీడియో చర్చి కమిటీ సభ్యత్వం గురించి ఆ చర్చి పాస్టర్ కీ మరియు ఒక వ్యక్తికి మధ్య జరిగిన గొడవ కి సంబంధించినది.

ప్రతి వారం, మేము ‘ఏది ఫేక్, ఏది నిజం’ అనే తెలుగు యూట్యూబ్ షో చేస్తున్నాం. మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll