గాయాలతో ఉన్న ఒక యువతి ఫోటోలు పెట్టి, తనపై హైదరాబాద్ లోని పాతబస్తీ కి చెందిన ముస్లిం యువకులు దాడి చేసారని చెప్తూ ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): పాతబస్తీలో జైశ్రీరామ్ అన్నందుకు హిందూ యువతిపై ముస్లిం యువకులు దాడి.
ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్న యువతి పేరు అనురాధ సోలంకీ. తను హర్యానా లోని సిర్సాలో ఉంటుంది. తను గాయాలతో ఉన్న ఫోటోలు వరకట్నం కేసుగా సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో తను ఫేస్బుక్ లైవ్ లో ఈ ఫోటోలు షేర్ చేయవద్దని, తనని తీసుకువెళ్ళడానికి తన భర్త వస్తున్నాడని చెప్పింది. పోస్ట్ లోని ఫోటోలకి హైదరాబాద్ కి అసలు సంబంధం లేదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
పోస్ట్ లోని ఫోటోలు గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, సెర్చ్ రిజల్ట్స్ లో ఇవే ఫోటోలతో ఉన్న ఒక ట్వీట్ వస్తుంది. ఆ ట్వీట్ చూస్తే ఫోటోలో ఉన్న యువతీ పేరు అనురాధా సోలంకి అని, తను హర్యానా లోని సిర్సా లో ఉంటుందని తెలుస్తుంది. కట్నం కోసం అనురాధ ని తన భర్త కొట్టినట్టు ఆ ట్వీట్ లో ఉంటుంది
తన పేరు తెలిసింది కాబట్టి ఫేస్బుక్ లో ‘అనురాధ సోలంకి’ అని వెతకగా, తన ఫేస్బుక్ అకౌంట్ దొరుకుతుంది. తన అకౌంట్ లో తను పెట్టిన ఫేస్బుక్ లైవ్ ఉంటుంది. దాంట్లో తన ఫోటోలను షేర్ చేయవద్దని, తన భర్త తనను తీసుకోపోవదానికి వస్తున్నందున ఇబ్బంది పెట్టవద్దని చెప్తుంది. తన కాపురం చల్లగా ఉండాలంటే తన ఫోటోలు షేర్ చేయవద్దని అందరిని ఆ వీడియోలో కోరుతుంది. పోస్ట్ లో హర్యానా లోని యువతి ఫోటోలు తీసుకొని ‘జై శ్రీరామ్’ అన్నందుకు పాతబస్తీ లో ముస్లిం యువకులు కొట్టారని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
చివరగా, హర్యానా యువతి ఫోటో పెట్టి హైదరాబాద్ లో ‘జై శ్రీరామ్’ అన్నందుకు ముస్లిం యువకులు కొట్టారంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?