ఫేస్బుక్ వినియోగదారులు చాలా మంది ‘ది వాషింగ్టన్ పోస్ట్’ వార్తా సంస్థ ఈ విధంగా పేర్కొన్నట్లుగా పోస్టు చేస్తున్నారు- ‘200 సంవత్సరాలలో ఇండియాను పాలించిన బ్రిటీషర్లు దోచుకున్న దాని కన్నా, 20 సంవత్సరాలలో సోనియా దోచుకుంది 3 రేట్లు ఎక్కువ’. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: 200 సంవత్సరాలలో ఇండియాను పాలించిన బ్రిటీషర్లు దోచుకున్న దాని కన్నా, 20 సంవత్సరాలలో సోనియా దోచుకుంది 3 రేట్లు ఎక్కువ’ అని ‘ది వాషింగ్టన్ పోస్ట్’ వార్తా సంస్థ పేర్కొన్నది.
ఫాక్ట్ (నిజం): పోస్టులో చెప్పిన విషయం గురించి ‘ది వాషింగ్టన్ పోస్ట్’ వార్తా సంస్థ వారు ఎటువంటి వార్తా కథనం ప్రచురించలేదు. ‘ది వాషింగ్టన్ పోస్ట్’ అలా పేర్కొన్నట్లుగా వార్తాపత్రికలు కానీ, మీడియా కానీ ఎక్కడా కూడా రిపోర్ట్ చేయలేదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
‘ది వాషింగ్టన్ పోస్ట్’ వార్తా సంస్థ వారు పోస్టులో ఆరోపించిన విషయం గురించి ఏదైనా కథనం రాశారా అని వెతికినప్పుడు, అలాంటి కథనం ఏదీ లభించలేదు. ఆ వార్తా సంస్థ అలా ఎక్కడైనా పేర్కొన్నదా అని గూగుల్ లో వెతికినప్పుడు, అందుకు సంబంధించిన సమాచారం సెర్చ్ రిజల్ట్స్ లో రాలేదు. ఒక వేల ‘ది వాషింగ్టన్ పోస్ట్’ సంస్థ నిజంగానే అలా పేర్కొని ఉంటే దేశం లోని అన్ని ప్రముఖ వార్తా పత్రికలు మరియు మీడియా సంస్థలు దాని గురించి ప్రచురించేవి. కానీ, అటువంటి న్యూస్ ఎవరు కూడా ప్రచురించలేదు.
గూగుల్ అడ్వాన్స్ సెర్చ్ ద్వారా ‘ది వాషింగ్టన్ పోస్ట్’ వెబ్సైటు లో సోనియా గాంధీ మరియు బ్రిటిష్ కి సంబంధించిన కథనం కోసం వెతికినా అటువంటి కథనాలు ఏవీ రిజల్ట్స్ లో రాలేదు.
చివరగా, ‘200 సంవత్సరాలలో ఇండియాను పాలించిన బ్రిటీషర్లు దోచుకున్న దాని కన్నా, 20 సంవత్సరాలలో సోనియా దోచుకుంది 3 రేట్లు ఎక్కువ’ అని ‘ది వాషింగ్టన్ పోస్ట్’ వార్తా సంస్థ పేర్కొనలేదు. అది ఒక ఫేక్ న్యూస్.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?