Fake News, Telugu
 

సూర్యుడి నుండి వచ్చే శబ్దం “ఓంకారం” అని నాసా డిక్లేర్ చేయలేదు

0

సూర్యుడి నుండి వచ్చే శబ్దం ఓంకారం అని నాసా సంస్థ చెప్పినట్టుగా ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్  చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): సూర్యుడి నుండి వచ్చే శబ్దం ఓంకారం అని నాసా (NASA) సంస్థ డిక్లేర్ చేసింది.

ఫాక్ట్ (నిజం): సూర్యుడి నుండి వచ్చే శబ్దాలను అందరు వినడానికి నాసా రిలీజ్ చేసింది. కానీ వచ్చే శబ్దం “ఓంకారం” అని ఎక్కడా కూడా డిక్లేర్ చేయలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో ఇచ్చిన సమాచారం కొరకు గూగుల్ లో వెతికితే, నాసా అలాంటి ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వలేదని తెలుస్తుంది. సూర్యుడు నుండి వెలువడే శబ్దాలను సాంకేతికంతగా రికార్డు చేసి నాసా సంస్థ అందరు వినడానికి రిలీజ్ చేసారు. వాళ్ళ వెబ్ సైట్ లోకి వెళ్లి వాటిని ఎవరైనా వినొచ్చు. కానీ వాళ్ళు ఆ సౌండ్ ని “ఓంకారం” అని ఎక్కడా కూడా డిక్లేర్ చేయలేదు. కొన్ని వెబ్ సైట్లలో మాత్రం కొందరు నాసా రిలీజ్ చేసిన రికార్డింగ్స్ లో “ఓం” లాగా ఒక శబ్దం వినిపిస్తుంది అని రాసారు. కానీ అదే ఆడియోలో ఎన్నో రకాల శబ్దాలు వినొచ్చు మరియు అధికారికంగా నాసా మాత్రం ఎక్కడా పోస్ట్ లో చెప్పినట్టుగా డిక్లేర్ చేయలేదు.

చివరగా, సూర్యుడి నుండి వచ్చే శబ్దం “ఓంకారం” అని నాసా డిక్లేర్ చేయలేదు.

ఎలక్షన్ కౌంటింగ్ ఎట్లా జరుగుతుందో మీకు తెలుసా? ఈ వీడియో చుడండి

Share.

About Author

Comments are closed.

scroll