చాలామంది ఫేస్బుక్ యూజర్స్ ఒక వీడియోని పోస్ట్ చేసి దానిని అసిఫా హత్య కేసు నిందితుడికి సంబంధించిన వీడియోగా ప్రచారం చేస్తున్నారు. దాంట్లో ఎంతవరకు నిజముందో ఓసారి విశ్లేషిద్దాం.
క్లెయిమ్ (దావా): పోస్ట్ లో ఉన్న వీడియో అసిఫా హత్య కేసు నిందితుడికి సంబంధించినది.
ఫాక్ట్ (నిజం): వీడియో మధ్యప్రదేశ్ లేదా ఉత్తర్ ప్రదేశ్ లోని ఒక కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న వ్యక్తి కి సంబంధించినది. దీనికి జమ్మూ & కాశ్మీర్లోని కతువా లో జరిగిన ఆసిఫా అత్యాచారం మరియు హత్యకు ఏటువంటి సంబంధం లేదు. కావున పోస్ట్ లో చేసిన ఆరోపణల్లో నిజం లేదు.
గూగుల్ లో “prisoner face blackened and beaten with slippers” అనే కీవర్డ్స్ తో వెతికినప్పుడు, అదే వీడియో ‘News Nation’ వార్తా సంస్థ వారు రాసిన ఒక కథనంలో కనుగొనబడింది. దాని ఆధారంగా, ఉత్తరప్రదేశ్ లో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులో ఉండగా కొంతమంది కాలేజీ బాలికలు చెప్పులతో కొట్టారు అని తెలిసింది. కానీ “న్యూస్ నేషన్” లో ఉన్న వీడియోని జాగ్రత్తగా గమనించినప్పుడు, పోలీసు వాహనం యొక్క నెంబర్ ప్లేట్ ని చూసిన్నట్లయితే అది “మధ్య ప్రదేశ్” రాష్ట్రానికి సంబంధించినదిగా తెలుసుకోవచ్చు.
వీడియో లో కనిపించే ఫ్లెక్సీ లో “ ఆరక్షి కేంద్రం హనుమాన్ గంజ్ , (ఆ ప్రాంతం పేరు) ఎం.పి” అని హిందీలో రాసి ఉంది.
వీటిని బట్టి ఈ వీడియో మధ్యప్రదేశ్ లో ఏదైనా కేసుకు సంబంధించినదని అయ్యి ఉండవచ్చని తెలుస్తుంది. కావున, ఈ వీడియో జమ్మూ & కాశ్మీర్ యొక్క కతువా కేసుకి సంబంధించినది కాదు. BOOM వారు కతువా కేసుని వాదిస్తున్నన్యాయవాది దీపికా సింగ్ రాజావత్ ని సంప్రదించినప్పుడు, ఈ వీడియో నకిలీది అని ఆమె తెలిపింది.
చివరగా, ఈ వీడియో మధ్యప్రదేశ్ లేదా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన ఏదైనా ఘటన కి సంబంధించిన కేసు అయి ఉండవచ్చు, కానీ జమ్ము & కాశ్మీర్ యొక్క కథువా కేసు కు సంబంధించినది కాదు.