చంద్రబాబు నాయుడు తన తమ్ముడిని గొలుసులతో కట్టేసాడంటూ ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. వీడియోలో ఒక వ్యక్తి తనను విడిచిపెట్టమని చంద్రబాబుని అడుగుతున్నట్టుగా ఉంటుంది. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): తమ్ముడు అయిన రామ్మూర్తి నాయుడు ని చంద్రబాబు నాయుడు గొలుసులతో కట్టేసాడు. వీడియో లో రామ్మూర్తి నాయుడు తనని విడిపించమని చంద్రబాబు ని అడుగుతున్నాడు.
ఫాక్ట్ (నిజం): వీడియో లో ఉన్నది రామ్మూర్తి నాయుడు కాదు. నార్నే శ్రీనివాస్ ఈ విషయం మీద మార్చ్ లో చంద్రబాబు పై చేసిన ఆరోపణల పై రామ్మూర్తి నాయుడు కొడుకు అయిన నారా రోహిత్ అప్పుడే తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఆ ఆరోపణ కొట్టిపరేసాడు.
ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన వీడియోని సరిగ్గా చూస్తే వీడియో లో ఉన్నది రామ్మూర్తి నాయుడు కాదని తెలుస్తుంది. అలానే వీడియో ఒక ప్రదర్శన లాగా ఉంటుంది. వీడియో లో ముందుగా కాళ్ళకు కట్టిన చైన్లు చూపెడుతున్నప్పుడు వీడియో లోని వ్యక్తి అసలు మాట్లాడాడు, సరిగ్గా తన ముఖం చూపెట్టినప్పుడే మాట్లాడడం మొదలుపెడుతాడు. మాట్లాడినప్పుడు కూడా నేరుగా చంద్రబాబుని తిట్టడంతో మొదలుపెడుతాడు.
అసలు రామ్మూర్తి నాయుడు ని గొలుసులతో చంద్రబాబు కట్టేసాడు అని మొట్టమొదటిగా మార్చి నెలలో YSRCP లో చేరాక నార్నే శ్రీనివాస్ ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పాడు. దాన్ని ఖండిస్తూ నారా రోహిత్ తన ఫేస్బుక్ అకౌంట్ లో తన తండ్రి మరియు చంద్రబాబు 2019 సంక్రాంతి అప్పుడు దిగిన ఒక ఫోటో పెట్టాడు. తన తండ్రి మీద వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ పోస్ట్ లో రాసాడు.
ఇదంతా సోషల్ మీడియా లో వైరల్ అవ్వక ముందే నారా రోహిత్ తన తండ్రి మెమోరీ లాస్ వ్యాధి తో భాదపడుతున్నారని 2017 లో idream ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పాడు.
చివరగా, వీడియో లో ఉన్నది రామ్మూర్తి నాయుడు కాదు. తన తండ్రి పై వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పిన నారా రోహిత్.
ప్రతి వారం, మేము ‘ఏది ఫేక్, ఏది నిజం’ అనే తెలుగు యూట్యూబ్ షో చేస్తున్నాం. మీరు చూసారా?