ఒక గుడిలో ఏనుగు కింద నుండి వెళ్లి దైవం తో వేషాలు వేస్తుందని ఒక యువతి వీడియో ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): ఏనుగు విగ్రహం కింద నుండి పాకుతూ గుడిలో వేషాలు వేస్తున్న మహిళ.
ఫాక్ట్ (నిజం): వీడియో లో ఉన్న ఏనుగు విగ్రహం అమరకంటక్ లోని నర్మదా ఉద్గం గుడి లోనిది. ఆలా ఏనుగు కింద నుండి పాకడం అక్కడి ఆచారం. కావున పోస్ట్ లో మహిళ గుడిలో వేషాలు వేస్తుందని పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఫేస్బుక్ లో పోస్ట్ కింద కామెంట్స్ లోనే ఒకతను ఆ ఏనుగు విగ్రహం అమరకంటక్ లోని గుడికి సంబంధించిందని రాసాడు. కావున గూగుల్ లో ‘Amarkantak Elephant Statue’ అని వెతకగా, ఆ విగ్రహానికి సంబంధించిన గుడి వివరాలతో ఉన్న ‘Outlook Traveller’ ఆర్టికల్ లింక్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ ప్రకారం వీడియో లో ఉన్న ఏనుగు విగ్రహం నర్మదా ఉద్గం గుడి కాంప్లెక్స్ లోని మాతా నర్మదా గుడిలోనిది. ఆ గుడి లోని ఏనుగు విగ్రహం కింద నుండి పాకడం అనేది అక్కడి ఆచారం అని ఆర్టికల్ లో చదవచ్చు.
ఆ గుడికి సంబంధించిన ఫోటోలు చూస్తే కూడా చాలా మంది ఆ విగ్రహం కింద నుండి పాకుతున్న ఫోటోలు ఉంటాయి. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
అంతే కాదు, యూట్యూబ్ లో ఆ గుడి గురించి వెతికితే కూడా చాలా మంది ఆ విగ్రహం కింద నుండి పాకుతున్న వీడియోలు ఉంటాయి.
చివరగా, వీడియోలో మహిళ వేషాలు వేయట్లేదు, గుడి ఆచారం పాటిస్తుంది.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?