Fake News, Telugu
 

వాట్స్ ఆప్ లో మూడు టిక్కులు అసలు రావు. మూడు టిక్కుల గురుంచి వైరల్ అవుతున్న మెసేజ్ అబద్దం

1

వాట్స్ ఆప్ లో రెండు టిక్కుల గురించి అందరికి తెలుసు కానీ ఇప్పుడు మూడు టిక్కుల గురించి కొందరు ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): మూడు నీలం రంగు టిక్ మార్కులు ఉంటే ఆ సందేశాన్ని ప్రభుత్వం పసిగట్టినట్టు; రెండు నీలం టిక్కులు మరియు ఒక ఎరుపు రంగు టిక్ ఉంటే ఆ సందేశం విషయంగా ప్రభుత్వం చర్య తీసుకోగలదు అని అర్థం.

ఫాక్ట్ (నిజం): వాట్స్ ఆప్ లో మెసేజెస్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తో ప్రొటెక్ట్ చేయబడుతాయి. కాబట్టి వాటిని ప్రభుత్వం చదవలేదు. కావున పోస్ట్ లో మూడు టిక్కుల గురించి రాసింది తప్పు.

టిక్కుల గురించి వాట్స్ ఆప్ వెబ్ సైట్ లో వెతికినప్పుడు ఎఫ్.ఏ.క్యు సెక్షన్ లో టిక్కుల మీద సమాచారం చూడొచ్చు. కానీ కేవలం రెండు టిక్కుల వరకే అక్కడ ఉంది. మూడు టిక్కుల గురించి వారి వెబ్ సైట్ లో ఎక్కడా కూడా వివరించలేదు.

అదే వెబ్ సైట్ లో వాట్స్ ఆప్ మెసేజెస్ ఎవరైన చదవగలరా అని వెతికినప్పుడు వాట్స్ ఆప్ లో మెసేజెస్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తో ప్రొటెక్ట్ చేయబడుతాయని తెలుస్తుంది. ప్రభుత్వమే కాదు వాట్స్ ఆప్ సంస్థ కూడా ప్రజలు పంపించుకునే మెసేజెస్ ని చదవలేదు.

అంతే కాకుండా గవర్నమెంట్ ఏజెన్సీస్ అడిగినప్పుడు ఎలాంటి సమాచారం వాట్స్ ఆప్ ఇస్తుందో వారి వెబ్ సైట్ లో చూస్తే కేవలం ప్రొఫైల్ ఫోటో, గ్రూప్ సమాచారం మరియు అడ్రస్ బుక్ వివరాలు మాత్రమే ఇస్తుందని తెలుస్తుంది. కావున పోస్ట్ లో చెప్పినట్టుగా ప్రభుత్వం ప్రజల వాట్స్ ఆప్ మెసేజెస్ చదవలేదు.

చివరగా, వాట్స్ ఆప్ లో మూడు టిక్కులు అసలు రావు. మెసేజెస్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తో ప్రొటెక్ట్ చేయబడుతాయి. కాబట్టి వాటిని ప్రభుత్వం చదవలేదు.

Share.

About Author

scroll