Fake News, Telugu
 

రాజా సింగ్ ని నెత్తి పగిలేల పోలీసులు కొట్టలేదు, తనే రాయితో కొట్టుకున్నాడు

0

గోషామహల్ MLA రాజా సింగ్ పై పోలీసులు లాఠీఛార్జ్ చేసి, తన నెత్తి పగిలేల దాడి చేసారంటూ ఉన్న పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): రాణి అవంతి విగ్రహాన్ని పునర్ నిర్మిస్తున్న రాజా సింగ్ పై పోలీసులు లాఠీఛార్జ్. నెత్తి పగిలి తీవ్ర రక్తస్రవం అయ్యేలా దాడి చేసి పోలీసులు.

ఫాక్ట్ (నిజం): రాజా సింగ్ ని అడ్డుకున్నప్పుడు తనకు తానే రాయితో నెత్తి మీద కొట్టుకొని గాయం చేసుకున్నాడని హైదరాబాద్ నగర పోలీసువారు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. అంతే కాదు, ఆ సంఘటన గురుంచి బయటకి వచ్చిన వీడియోలలో కూడా తనకు తానే రాయితో కొట్టుకున్నట్టు చూడొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, హైదరాబాద్ నగర పోలీసువారు ఈ విషయం పై ట్విట్టర్ లో తమ అధికారిక అకౌంట్ ద్వారా స్పందించారని తెలుస్తుంది. ఆ ట్వీట్ చూస్తే పోలీసులు విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకున్నప్పుడు తనకు తానే రాయితో నెత్తి మీద కొట్టుకొని రాజా సింగ్ గాయం చేసుకున్నట్టు ఉంటుంది. కావున పోస్ట్ లో చెప్పినట్టు రాజా సింగ్ ని నెత్తి పగిలేల పోలీసులు కొట్టలేదు, తనే కొట్టుకున్నాడు.

రాజా సింగ్ తన నెత్తిని రాయితో కొట్టుకుంటున్న వీడియోని కూడా హైదరాబాద్ నగర కమీషనర్ అంజని కుమార్ తన అధికార ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసారు. ఈ వీడియోలలో కూడా తనకు తానే రాయితో కొట్టుకున్నట్టు చూడొచ్చు.

చివరగా, రాజా సింగ్ ని నెత్తి పగిలేల పోలీసులు కొట్టలేదు, తనే రాయితో కొట్టుకున్నాడు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll