Fake News, Telugu
 

పవన్ కళ్యాణ్ ని మహేంద్ర సింగ్ ధోని పొగిడాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు

0

పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచి ఎత్తేసిన మహేందర్ సింగ్ ధోని’ అంటూ కొంత మంది ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ లో పేర్కొన్న విషయంలో ఎంత వరకు నిజముందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ధోని జనసేన పార్టీ కి మద్దతుగా ఆ పార్టీ ముద్ర ఉన్న టీ-షర్ట్ ని ధరించారు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచ్చెత్తారు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ధోని జనసేన పార్టీ ముద్ర ఉన్న టీ-షర్ట్ ని ధరించినట్లుగా పెట్టిన ఫోటో ఒక ఫోటోషాప్ చేయబడిన ఫోటో. ధోని , పవన్ కళ్యాణ్ ని పొగిడినట్లుగా ఎక్కడా సమాచారం లభించలేదు. కావున, పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో నిజం లేదు.

పోస్ట్ లో పెట్టిన ఇమేజ్ ని ధోని ఉన్న భాగాన్ని మాత్రమే క్రాప్ చేసి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, క్రికెటర్ హార్దిక్ పాండ్యతో ధోని ఉన్న పూర్తి ఫోటో సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. ఆ ఫోటో కోసం హార్దిక్ పాండ్య ట్విట్టర్ అకౌంట్ లో ట్విట్టర్ అడ్వాన్స్డ్ సెర్చ్ ద్వారా వెతకగా, దానిని పాండ్య  ధోనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ జులై 7, 2017 న పెట్టిన ట్వీట్ లో లభించింది. ఈ ఫోటోని ధోని ఉన్న భాగాన్ని మాత్రమే క్రాప్ చేసి, ఫోటోషాప్ ద్వారా జనసేన పార్టీ గుర్తును ఆయన ట్-షర్ట్ పైన పెట్టారు.

గూగుల్ లో ధోని , పవన్ కళ్యాణ్ ని పొగడడం గురించి వెతికినప్పుడు, ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లభించలేదు. పోస్ట్ లో పెట్టిన ‘a2zmovienews.com’ వెబ్సైటు వారి ఇతర ఆర్టికల్స్ చూసినప్పుడు, వారు ఇంతకుముందు కూడా ఇటువంటి చాలా ఆవాస్తవమైన కథనాలు ప్రచురించినట్లుగా తెలుస్తుంది.

గతంలో, విరాట్ కోహ్లీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచ్చెత్తారు అంటూ ఫేస్బుక్ లో ప్రచారం చేశారు. ఆ వార్తల్లో కూడా ఎటువంటి నిజం లేదు. చివరగా, పవన్ కళ్యాణ్ ని మహేంద్ర సింగ్ ధోని పొగిడాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll