UPDATE (19 ఫిబ్రవరి 2022): 2016లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం బృందం నరేంద్ర మోదీ మైనపు శిల్పం చెక్కడానికై, ఆయన శరీర కొలతలు తీసుకుంటున్నప్పటి పాత వీడియోను ఇప్పుడు “రోజు ఫోటోషూట్ల కోసం ఇలా 18 గంటలు ఇలా కష్టపడితేనే కాని ఫోటోలు బాగారావు” అన్న క్లెయిమ్ తో వైరల్ చేస్తున్నారు.
చాలా మంది ఫేస్బుక్ యూజర్స్ మోడీ ఫోటో ఒకటి పోస్ట్ చేసి అది ఆయన హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకున్నప్పటిది అని అందులో పేర్కొన్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో ఓసారి విశ్లేషిద్దాం.
క్లెయిమ్ (దావా): పోస్ట్ చేసిన ఫోటోలో మోడీ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేపించుకుంటున్నాడు
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో పెట్టిన ఫోటో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం బృందం మోడీ మైనపు శిల్పం చెక్కడానికై, ఆయన శరీర కొలతలు తీసుకుంటున్నప్పటిది. కావున పోస్ట్ లోని ఆరోపణల్లో నిజం లేదు.
పోస్ట్ లో పెట్టిన మోడీ ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది ‘Hindustan Times’ వారు ప్రచురించిన కథనంలో లభించింది. 2016 లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం బృందం మోడీ శిల్పం చెక్కడం కోసం ఆయన శరీర కొలతలు తీసుకోవడానికి భారత దేశం వచ్చారు. వారు ఆ సందర్భంలో చాలా ఫోటోలు తీశారు. పోస్ట్ లో పెట్టిన ఫోటో అందులో ఒకటి. ఆ ఫోటోని కొంత మంది తప్పుడు ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారు.
చివరగా, పోస్ట్ లో పెట్టినది మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం బృందం మోడీ మైనపు శిల్పం చెక్కడం కోసం ఆయన శరీర కొలతలు తీస్కున్నప్పటిది.