Fake News, Telugu
 

ఫోటో లో ప్రధాని మోడీ తో ఉన్నది అభినందన్ భార్య మరియు కుమారుడు కాదు

0

ప్రధాన మంత్రి మోడీని అభినందన్ భార్య మరియు కుమారుడు కలిసారని ఒక ఫోటోని ‘వడ్డాది ఉదయకుమార్’ అనే వ్యక్తి ఫేస్బుక్ లో పోస్ట్ చేసాడు. వైరల్ అవుతున్న ఆ ఫోటోలో ఎంత వరకు నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం.

క్లెయిమ్ (దావా): భారతదేశ ప్రధాని మోడీ తో అభినందన్ భార్య మరియు కుమారుడు.

ఫాక్ట్ (నిజం): ఫోటో లో ఉన్నది అభిందన్ భార్య మరియు కుమారుడు కాదు. వాళ్ళు పొలిటికల్ వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ భార్య మరియు కుమారుడు.

గూగుల్ లో ‘Abhinandan’s wife’ అని సెర్చ్ చేస్తే దైనిక్ భాస్కర్ ఆర్టికల్ ఒకటి వస్తుంది. ఆ ఆర్టికల్ లో అభినందన్ కుటుంబం యొక్క ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోల్లో తన భార్య ఫోటో కూడా ఉంది. అదే ఫోటోని అభినందన్ పాకిస్తాన్ లో చిక్కుకుపోయినప్పటి నుండి తన కుటుంబ చిత్రంగా చాలా మీడియా చానల్స్ చూపెడుతున్నారు. ఆ ఫోటోని పోస్ట్ లోని ఫోటోతో పోలిస్తే తను అభినందన్ భార్య కాదు అని తెలుస్తుంది. ఇండియన్ డిఫెన్సు ట్విట్టర్ హండిల్ లో నిర్మలా సీతరామన్ అభినందన్ ని కలవడానికి వెళ్ళినప్పుడు హాస్పిటల్ లో తీసిన ఫోటోలో కూడా తన భార్యని చూడవచ్చు.

బూమ్ లైవ్ సంస్థ రాసిన ఆర్టికల్ ప్రకారం ఆ ఫోటోలో ఉన్నది పొలిటికల్ వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ భార్య జాహ్నవి దాస్ మరియు కుమారుడు. జాహ్నవి దాస్ ఫేస్బుక్ ప్రొఫైల్ లో తను పోస్ట్ చేసిన ఫోటో చూస్తే మోడీ తో ఉన్నది తనే అని తెలుస్తుంది. కావున కచ్చితంగా ఫోటో లో ఉన్నది అభినందన్ భార్య మరియు కుమారుడు కాదని చెప్పవచ్చు.

చివరగా, ఫోటో లో ప్రధాని మోడీ తో ఉన్నది అభినందన్ భార్య మరియు కుమారుడు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll