Fake News, Telugu
 

ఫోటోలో ఉన్నది రాంచీ కలెక్టర్ కాదు. అది ఫేక్ న్యూస్.

0

తన సంప్రదాయ దుస్తుల్లో కలెక్టర్ గా బాధ్యతలు తీసుకునట్టుగా ఒక బంజారా యువతి ఫోటోని చాలా మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): జార్ఖండ్ లోని రాంచీకి కలెక్టర్ గా బాధ్యతలు తీసుకొని బంజారా డ్రెస్ లో హాజరు అయిన శ్రీమతి శోభ రాథోడ్.

ఫాక్ట్ (నిజం): రాంచీ డిప్యూటీ కమీషనర్ స్వయంగా ఇది ఫేక్ న్యూస్ అని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. కావున ఫేస్బుక్ లో షేర్ అవుతున్న పోస్ట్ లో ఎటువంటి నిజం లేదు.

రాంచీ జిల్లా యొక్క అధికారిక వెబ్ సైట్ లో కలెక్టర్ గురించి వెతకగా శోభ రాథోడ్ పేరుతో ఎవ్వరు లేరు అని తెలుస్తుంది. అలానే వెబ్ సైట్ లో ఇచ్చిన అధికారిక ట్విట్టర్ అకౌంట్ చూడగా ఫేస్బుక్ లో వైరల్ అవుతున్న పోస్ట్ పై రాంచీ డిప్యూటీ కమీషనర్ స్పందించినట్టు చూడవచ్చు. “పోస్ట్ లో ఉన్నది ఫేక్ న్యూస్, దయచేసి డిలీట్ చేయండి మరియు షేర్ చేయకండి” అని పోస్ట్ లో ఉన్న ఫోటో తో కూడిన కొన్ని ట్వీట్ల పై రాంచీ డిప్యూటీ కమీషనర్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు.

అలాగే అసలు శోభ రాథోడ్ పేరుతో ఎవరన్న IAS అధికారి ఎక్కడైనా ఉన్నారా అని IAS సివిల్ లిస్టు లో వెతకగా అలాంటి పేరుతో భారత దేశంలో ఎక్కడా కూడా IAS అధికారి లేరని తెలుస్తుంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. ఫోటో లో ఉన్నది ఎవరని తెలుసుకోవడానికి ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా ఫోటోతో కూడిన బంజారా పాటలు కొన్ని వస్తాయి. కాబట్టి తను ఒక బంజారా గాయని అయ్యుండవచ్చు.

చివరగా, ఫోటో లో ఉన్నది రాంచీ కలెక్టర్ కాదు. అది ఒక ఫేక్ న్యూస్.

Share.

About Author

Comments are closed.

scroll