గౌతమ్ అదానీ భార్యకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నారని చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): గౌతమ్ అదానీ భార్యకు శిరస్సు వంచి ప్రణామం చేస్తున్న మోడీ.
ఫాక్ట్ (నిజం): ఫోటోలో మోడీ ప్రణామం చేస్తున్నది అప్పటి తుమ్కూర్ మేయర్ గీత రుద్రేశ్ కి, గౌతమ్ అదానీ భార్యకు కాదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
పోస్ట్ లో రెండు ఫోటోలు ఉంటాయి. మొదటిది, మోడీ 2014 లో ‘HN Reliance Foundation Hospital’ ప్రారంభోత్సవం కి వెళ్ళినప్పుడు తీసినది. రెండవ ఫోటో లో మోడీ ఒకరికి శిరస్సు వంచి ప్రణామం చేస్తుంటారు. రెండవ ఫోటో గురించి తెలుసుకోవడానికి ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ ఫోటో 2014 లో ‘India Food Park’ ని ప్రారంభించడానికి మోడీ తుమ్కూర్ (కర్ణాటక) వెళ్ళినప్పుడు తీసినదని తెలుస్తుంది. ఫోటోలో ఉన్నది తుమ్కూర్ మేయర్ గీత రుద్రేశ్ అని అప్పట్లో ఒక వార్తాపత్రికలో వచ్చిన ఆర్టికల్ ని ఒకరు ట్వీట్ చేసారు.
@nistula PM Modi greets Tumkur Mayor Ms. Geetha Rudresh Yesterday. pic.twitter.com/vXcozjNOUC
— kush (@kushblr) September 25, 2014
అంతేకాదు, ‘OneIndia Kannada’ ఆర్టికల్ లో మోడీ పర్యటన వివరాలు చూస్తే కూడా పొద్దున్న 9:56 కి తుమ్కూర్ హెలిపాడ్ కి చేరుకున్న మోడీ కి తుమ్కూర్ మేయర్ స్వాగతం పలికినట్టు ఉంటుంది.
చివరగా, ఫోటోలో మోడీ శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నది అప్పటి తుమ్కూర్ మేయర్ కి, గౌతమ్ అదానీ భార్యకు కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?