మాజీ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం తన చిన్నప్పుడు పేపర్ బాయ్ గా పనిచేసినప్పుడు తీసిన ఫోటో అని ఒక పోస్ట్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు . ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): ఫోటో లో ఉన్నది అబ్దుల్ కలాం. పేపర్ బాయ్ గా తను చిన్నప్పుడు పనిచేస్తున్నప్పుడు తీసిన ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్నది అబ్దుల్ కలాం కాదు. ఒక కలర్ ఫోటోని ఎడిట్ చేసి పాత ఫోటో గా చూపెడుతూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటో ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికినప్పుడు, అదే ఫోటో యొక్క కలర్డ్ వెర్షన్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. అలానే కలర్ ఫోటో తో కూడిన ‘The Hindu’ ఆర్టికల్ కూడా సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ 2011 లో ప్రచురించబడింది మరియు ఆ ఫోటోని సుభాష్ అనే వ్యక్తి తీసాడు. ఆ ఫోటో కింద వివరణ (‘Diligent: A paperboy on his way to deliver the morning newspapers.’) లో అబ్దుల్ కలాం కి సంభందించి ఏమీ రాసి ఉండదు.
చివరగా, ఫోటో లో ఉన్నది అబ్దుల్ కలాం కాదు. అది ఇటీవల తీసిన ఫోటో.
ప్రతి వారం, మేము ‘ఏది ఫేక్, ఏది నిజం’ అనే తెలుగు యూట్యూబ్ షో చేస్తున్నాం. మీరు చూసారా?