Fake News, Telugu
 

ఫేస్బుక్ డిలీట్ చేసిన కాంగ్రెస్ అకౌంట్స్ కి పాకిస్తాన్ సైన్యం కి ఎటువంటి సంబంధం లేదు

0

తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంభందించిన వ్యక్తులు నడుపుతున్న  పేజీలను, అకౌంట్స్ ని ఫేస్బుక్ డిలీట్ చేసింది. డిలీట్ అయిన  పేజీలలో కొన్నిటిని పాకిస్తాన్ సైన్యం నిర్వహిస్తోందని చాలా మంది ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): బయటపడ్డ కాంగ్రెస్-పాకిస్తాన్ అక్రమ సంబంధం. కాంగ్రెస్ నిర్వహిస్తున్న 687 కి పైగా నకిలీ ఫేస్ బుక్ పేజెస్ లో 100 కి పైగా వాటిని పాకిస్తాన్ సైన్యం నిర్వహిస్తోంది.

ఫాక్ట్ (నిజం): ఫేస్బుక్ సైబర్ సెక్యూరిటీ హెడ్ గ్లిఎచేర్ రాసిన ఆర్టికల్ లో పాకిస్తాన్ కి సంభందించిన 103 నకిలీ పేజెస్ కి మరియు కాంగ్రెస్ కి సంభందించిన 687 నకిలీ పేజెస్ మరియు అకౌంట్స్ కి ఎటువంటి సంభందం లేదని ఉంది. కావున పోస్ట్ లో రాసింది తప్పు.

పోస్ట్ చేసిన ఫోటో నిజంగా రిపబ్లిక్ టీవీ కి సంభందించినదా అని వెతికితే సోమవారం రోజు ‘కాంగ్రెస్ ఫేక్ పోస్ట్ లకు పాకిస్తాన్ సైన్యం తో సంభంధం ఉందా?’ అని ఒక డిబేట్ నిర్వహించింది. కావున పోస్ట్ లోని ఫోటో రిపబ్లిక్ టీవీ కి చెందినదే.

కానీ ఫేస్బుక్ తన న్యూస్ రూం లో రాసిన ఆర్టికల్ ప్రకారం రెండిటికి ఎటువంటి సంభందం లేదని తెలుసుకోవచ్చు. ఫేస్బుక్ చెప్పిన దాని ప్రకారం, వాళ్ళు ఇటువంటి అకౌంట్స్ మరియు పేజెస్ పై  నాలుగు (4) యాక్షన్స్  తీసుకున్నారు. ఆ తీసుకొన్న నాలుగు యాక్షన్స్  లో ఒక దానితో ఇంకో దానికి సంబంధం లేదు అని తమ ఆర్టికల్ లో క్లియర్ గా ఫేస్బుక్ పేర్కొంది. తీసుకొన్న నాలుగు యాక్షన్స్ మనం చూస్తే, దానిలో  పాకిస్తాన్ తో సంబంధం ఉన్న పేజీలు మరియు కాంగ్రెస్ కి సంబందించిన పేజీలు రెండు వెరీ. ఒక దానితో ఇంకో దానికి సంబంధం లేదు.

పాక్ సైన్యం మరియు కాంగ్రెస్ కి సంభందించిన పేజీలు మాత్రమే కాకుండా బీజేపీ కి మద్దతు  తెలిపే పేజీలని కూడా ఫేస్బుక్ డిలీట్ చేసింది. కావున పోస్ట్ లో చెప్పినట్టుగా డిలీట్ అయిన కాంగ్రెస్ కి సంభందించిన ఫేస్బుక్ అకౌంట్స్ ని పాకిస్తాన్ నిర్వహించట్లేదు.చివరగా, ఫేస్బుక్ డిలీట్ చేసిన కాంగ్రెస్ అకౌంట్స్ కి పాకిస్తాన్ సైన్యం కి ఎటువంటి సంబంధం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll