కాంగ్రెస్ పార్టీ పాలనలో 2007-08 ఆర్ధిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (GDP) ఎక్కువ ఉంటే మోడీ పాలనలో 2017-18 స్థూల దేశీయోత్పత్తి (GDP) తక్కువగా ఉందని ఫేస్బుక్ లో ఒక పేజీ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ని చాలా మంది షేర్ కూడా చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజం ఉందో ఒక సారి విశ్లేషిద్దాం.
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
క్లెయిమ్ (దావా): కాంగ్రెస్ పాలనలో 2007-08 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (GDP) 10.23% ఉంటే మోడీ పాలనలో 2017-18 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి 6.7% ఉంది
ఫాక్ట్ (నిజం): కాంగ్రెస్ పాలనలో 2007-08 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (GDP) 9.0 మాత్రమే ఉండగా మోడీ పాలనలో 2017-18 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (GDP) 6.7% ఉంది. అలాగే పోస్ట్ లో తమ అభిప్రాయానికి అనుకూలంగా ఉండే సంవత్సరాలు మాత్రమే తీసుకున్నారు. కావున పోస్ట్ లోని సంఖ్యలు కేవలం తప్పుదోవ పట్టించడానికి ఉపయోగించారు.
రెండు ప్రభుత్వలలో జీడీపీ సంఖ్యలు చూడగా మోడీ పాలనలోని కొన్ని ఆర్ధిక సంవత్సరాలలో (2014-15,2015-16) జీడీపీ కాంగ్రెస్ పాలనలోని కొన్ని ఆర్ధిక సంవత్సరాల( 2004-05,2008-09,2011-12,2012-2013,2013-14) జీడీపీ కంటే ఎక్కువగా ఉందని కూడా మనం గుర్తించవచ్చు. పోస్టులో ప్రచురించిన వ్యక్తి కేవలం కాంగ్రెస్ పాలనలో ఎక్కువ ఉన్న జీడీపీ సంఖ్యను మోడీ పాలనలో తక్కువగా ఉన్న జీడీపీ సంఖ్యను మాత్రమే మనకు పోల్చి చూపించడం జరిగింది.
చివరగా, పోస్ట్ లో కేవలం తమకు అనుకూలంగా ఉండే సంవత్సరాలు తీసుకొని GDP ని పోల్చి తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు.