పెట్రోల్ బంకులో ఇచ్చే పెట్రోల్ ధర లో ఉండే వివిధ పన్నులును మరియు డీలర్ లాభాన్ని వివరిస్తూ ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో పది వేల మందికి పైగా షేర్ చేసారు. ఆ వివరాలు చూస్తే పెట్రోల్ ధర లో కేంద్ర పన్ను కంటే రాష్ట్ర పన్ను సుమారు రెండింతలు ఉన్నట్టు చూడవచ్చు. ఆ పోస్ట్ లో ఇచ్చిన వివరాలల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ : పెట్రోల్ ధరలో ఉండే వివిధ పన్నులు మరియు డీలర్ లాభం యొక్క వివరాలు. పెట్రోల్ ధరలో కేంద్ర పన్నుతో పోలిస్తే రాష్ట్ర పన్ను రెండింతలు.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఇచ్చిన వివరాలల్లో చాలా తప్పులు ఉన్నాయి. కేంద్ర పన్ను 16.50 రూపాయులు కాదు. గత ఐదేళ్ళుగా సగటున 19 నుండి 20 రూపాయులు మధ్యన ఉంటుంది. డీలర్ లాభం 6.55 రూపాయులు కాదు, సగటున 3.55 రూపాయులు. అంతే కాదు, కేంద్ర పన్నుతో పోలిస్తే రాష్ట్ర పన్ను రెండింతలు కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పెట్రోల్ బంకులో దొరికే పెట్రోల్ ధరలో ఎటువంటి పన్నులు మరియు లాభాలు ఉంటాయో తెలుసుకోవడానికి గూగుల్ లో వెతకగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు తమ వెబ్ సైట్ లో పెట్టిన ‘Petrol Price Buildup’ దొరుకుతుంది. దాంట్లో ఇచ్చిన వివరాలు కింద ఫోటోలో చూడవచ్చు, కానీ అవి ఢిల్లీకి (ఢిల్లీ లో పెట్రోల్ పై రాష్ట్ర పన్ను – 27%) సంబంధించిన వివరాలు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పన్నులు వేరుగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘Petroleum Planning and Analysis Cell’ వారి వెబ్ సైట్ లో ఇచ్చిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ పై రాష్ట్ర పన్ను 31% VAT + Rs.2/litre VAT అని, తెలంగాణ లో పెట్రోల్ పై రాష్ట్ర పన్ను 35.20% VAT అని చూడవచ్చు.
ఆంధ్రప్రదేశ్:
తెలంగాణ:
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వివరాలు చూస్తే పోస్ట్ లో ఇచ్చిన అంకెలు తప్పని తెలుస్తుంది. పెట్రోల్ ధరలో కేంద్ర పన్ను కంటే రాష్ట్ర పన్ను రెండింతలు లేదు. మరింత సమాచారం కోసం FACTLY ఇంతకు ముందు పెట్రోల్ మరియు డీజిల్ ధరల పై రాసిన ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, పెట్రోల్ ధరలో ఉండే వివిధ పన్నులు గురించి వివరిస్తూ ఉన్న పోస్టులోని వివరాలు తప్పు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?