ఎప్పుడూ వివిధ సామజిక అంశాల మీద స్పందించే సినీ నటులు మరియు రాజకీయ నాయకులు ప్రకాష్ రాజ్ మరియు కమల్ హాసన్ పుల్వామా బ్లాస్ట్ ఎటాక్ మీద ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నిస్తూ ఒక ఫోటోని ‘నమో నమః – Namo Namah’ అనే ఫేస్బుక్ పేజీ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో ప్రకష్ రాజ్ మరియు కమల్ హాసన్ ని దేశ ద్రోహులుగా అభివర్ణించారు. ప్రకాష్ రాజ్ మరియు కమల్ హాసన్ పుల్వామా దాడి మీద అసలు స్పందించారో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం.
క్లెయిమ్ (దావా):పుల్వామా దాడి తర్వాత స్పందించని దేశ ద్రోహులు (ప్రకాష్ రాజ్ మరియు కమల్ హాసన్).
ఫాక్ట్ (నిజం): పుల్వామా బ్లాస్ట్ జరిగిన రోజే ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఉగ్రవాదుల దాడి మీద స్పందించాడు . అంతే కాదు మృతి చెందిన ఒక జవాన్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. మరో వైపు కమల్ హాసన్ కొంత ఆలస్యంగా స్పందించారు. ఫిబ్రవరి 17న ఒక ఈవెంట్ లో కమల్ హాసన్ పుల్వామా దాడి మీద స్పందించాడు. తన స్పందన కొంత వివాదాస్పదం కూడా అయ్యింది.
చివరగా, ప్రకాష్ రాజ్ దాడి జరిగిన రోజే స్పందించారు. కమల్ హాసన్ కూడా స్పందించారు కానీ కొంత ఆలస్యంగా తన అభిప్రయాన్ని చెప్పారు.