Fake News, Telugu
 

ఆ ఫోటో భారత్ సైనికుడిది కాదు, ఒక వేటగాడిది

0

పుల్వామా దాడి జరిగిన తర్వాత చాలా మంది జవాన్ల కి సంభందించిన ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. భారత సైనికుడు చెట్టుమీద -20 డిగ్రీ సెల్సియస్ చలి లో దేశ సంరక్షణ కోసం కదల కుండా నిలబడ్డాడని ఒక ఫోటోని కొందరు పోస్ట్ చేసారు. ఆ ఫోటో నిజంగా భారత సైనికుడిదో కాదో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం.

క్లెయిమ్ (దావా): మన కోసం కాశ్మీర్ లో -20 డిగ్రీ సెల్సియస్ అతి తీవ్రచలిలో, రాత్రంతా అలా కదలకుండా నిలబడి, అక్కడ ఒక మనిషి ఉన్నాడనే అనుమానం రాకుండా, కాపలా కాస్తున్న భారత సైనికుడు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటో ని యాన్డెక్స్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే ఆ ఫోటో అసలు సైనికుడిదే కాదని తెలుస్తుంది. ఆ ఫోటో ఒక వేటగాడిది. ‘మోస్సి ఓక్’ అనే అమెరికా సంస్థ వేటగాళ్ళు వేటాడే సమయం లో జంతువులకు కనపడకుండా వేసుకునే దుస్తులను తాయారు చేస్తుంటుంది. ఫోటోలో చుసిన దుస్తులు ఆ సంస్థ తాయారు చేసినవే. పోస్ట్ లోని ఫోటోని ఆ సంస్థ తమ ఇన్స్టగ్రామ్ లో పోస్ట్ కూడా చేసారు. ఫోటోని కొంచం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు ఎర్ర రంగులో బాణాలు కూడా కనిపిస్తాయి.

చివరగా, ఫోటోలో ఉన్నది భారత సైనికుడు కాదు. ఆ ఫోటో ఒక వేటగాడిది.

Share.

About Author

Comments are closed.

scroll