Fake News, Telugu
 

పాత వీడియో పెట్టి ‘ఆర్టికల్ 370 రద్దుకు మద్దతుగా ముస్లిం సోదరులు ర్యాలీ ’ అని తప్పుదోవ పట్టిస్తున్నారు

0

ఆర్టికల్ 370 రద్దుకు మద్దతుగా ముస్లిం సోదరుల ర్యాలీ అంటూ ఒక వీడియోతో ఉన్న పోస్ట్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : ఆర్టికల్ 370 రద్దుకు మద్దతుగా ముస్లిం సోదరులు ర్యాలీ

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఉన్నది పాత వీడియో. ఈ సంవత్సరం మే నెలలో ఇదే వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్టుగా చూడొచ్చు. కావున, పాత వీడియో పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.    

పోస్ట్ లోని వీడియోని ఇన్విడ్ ప్లగిన్ సహాయంతో ఫ్రేమ్స్ గా విభజించి, వాటిని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, పోస్ట్ లో ఉన్న వీడియో లాంటిదే కొన్ని వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. వాటిల్లో ఒక వీడియోని మే నెలలోనే యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టుగా చూడవచ్చు. ఆ వీడియో కింద ‘Muslims Celebrate on PM Narendra Modi Victory from Varanasi in 2019 Loksabha Polls’ అని రాసి ఉంటది. ఆ వీడియో లో మోడీ గెలిచినందుకే వాళ్ళు రాలీ లో పాల్గొన్నారని కచ్చితంగా చెప్పలేము, కానీ అది ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత తీసిన వీడియో మాత్రం కాదు.

చివరగా, పాత వీడియో పెట్టి ‘ఆర్టికల్ 370 రద్దుకు మద్దతుగా ముస్లిం సోదరులు ర్యాలీ ’ అని తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll