Fake News, Telugu
 

పాత మరియు ఫోటోషాప్ చేసిన ఫోటోలను ఉపయోగించి తాజాగా ‘కువైట్‌లో 62 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది’ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు

0

‘కువైట్ లో రికార్డయిన అత్యధిక ఉష్ణోగ్రత….62°C’ అంటూ ఫేస్బుక్ లో కొంత మంది పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ లో పేర్కొన్న విషయంలో ఎంత వరకు నిజముందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): కువైట్‌లో అత్యధికంగా 62 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.

ఫాక్ట్ (నిజం): ఉష్ణోగ్రత 62 డిగ్రీల సెల్సియస్‌గా చూపించే ఫోటో ఒక ఫోటోషాప్ చేయబడిన ఫోటో మరియు ఎండ తీవ్రతకు ట్రాఫిక్ సిగ్నల్స్ కాలిపోయినట్లుగా ఉన్న ఫోటో ఒక పాత ఫోటో. కావున, పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో నిజంలేదు.

కువైట్‌లో 62 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందనే వార్తలు సోషల్ మీడియాలో గత 3 సంవత్సరాలుగా వ్యాప్తిలో ఉన్నాయి. “Kuwait Times” వార్తా సంస్థ వారు అలా వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ జూలై 2, 2017 న ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. ఈ కథనం ప్రకారం, 62 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను చూపించే ఫోటో ఫోటోషాప్ చేయబడిన ఫోటో మరియు కువైట్‌ చరిత్రలో ఎప్పుడూ కూడా 62 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవ్వలేదు అని పేర్కొంది.

ట్రాఫిక్ సిగ్నల్స్ కాలిపోయినట్లుగా చూపించే ఫోటో కూడా ఒక పాత ఫోటో. గూగుల్ రివర్స్ సెర్చ్ టెక్నిక్ ద్వారా వెతికినప్పుడు, దానిని ఒక వ్యక్తి  తన ట్విట్టర్ అకౌంట్ లో జులై 7, 2017న పెట్టిన ఒక ట్వీట్ లో కనుగొనబడింది.

చివరగా, పాత మరియు ఫోటోషాప్ చేసిన ఫోటోలను ఉపయోగించి తాజాగా కువైట్‌లో 62 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll