Fake News, Telugu
 

నగరంలో హై అలెర్ట్, అదృశ్యం అవుతున్న మహిళలు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు

0

తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో, చాలా మంది అదృశ్యం అవుతున్నారని చెప్తూ ఫేస్బుక్ మరియు వాట్స్ఆప్ లల్లో చాలా మంది వీడియోలు మరియు ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): నగరంలో హై అలెర్ట్. ఒక్క రోజే 43 మందికి పైగా నగరంలో అదృశ్యం. తప్పిపోతున్న మహిళలు మరియు పిల్లలు. మహిళలు రాత్రి పుట ఒంటరిగా తిరగకుండా త్వరగా ఇంటికి వచ్చేయండి.

ఫాక్ట్ (నిజం): మిస్ అయిన వాళ్ళల్లో చాలా వరకు కుటుంబం, ప్రేమ వ్యవహారం, పరీక్షలు విఫలమవ్వడం వంటి కారణాల వల్ల కుటుంబాన్ని విడిచి పెట్టిన మహిళలు మరియు పురుషులు; తల్లిదండ్రుల మీద కోపంతో అలిగి వెళ్ళిపోయిన పిల్లలు మరియు పిల్లల సంరక్షణ దొరకని వృద్ధులు ఉన్నారని తెలంగాణ డీజీపీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసారు. మిస్సింగ్ కేసుల్లో 85 శాతం వరకు ట్రేస్ చేయగలుగుతున్నామని, మిగిలిన వాటిపై కూడా తగిన విచారణ చేస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రజలను బయపెట్టే విధంగా వస్తున్న పోస్టుల్లో నిజం లేదని, ఎవరైనా అలాంటివి షేర్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఈ విషయంపై వైరల్ అవుతున్న చాలా వరకు పోస్టుల్లో ఈనాడు వార్తా పత్రికను రిఫరెన్స్ గా ఇస్తున్నారు. కావున ఈనాడు పత్రికలో ఇలాంటి వార్త గురించి వెతకగా, 11 జూన్,2019 న మిస్సింగ్ కేసులపై ఒక ఆర్టికల్ ని ప్రచురించినట్టుగా చూడవచ్చు.

అయితే అదే ఆర్టికల్ లో రెండు విషయాలు గమనించవచ్చు. ఒకటి, మిస్ అవుతున్న వారిలో చాలా మంది ప్రేమ వ్యవహారాల వల్ల ఇంట్లో నుండి వెల్లిపోతునట్టు ఉంటుంది. కానీ ఫేస్బుక్ పోస్టులల్లో కారణాలు చెప్పకుండా మహిళలను జాగ్రత్తగా ఉండమంటూ నగరంలో హై అలెర్ట్ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ డీజీపీ ఈ పోస్టులను ఖండిస్తూ మిస్సింగ్ కేసులకు కారణాలు చెప్తూ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసారు.

రెండు, పోలీసు స్పందన అంతంత మాత్రమేనని ఈనాడు ఆర్టికల్ లో ఉంటుంది. అయితే ఈ విషయాన్ని కూడా ఖండిస్తూ 2018 లో ఇలాటి మిస్సింగ్ కేసులల్లో 85 శాతం వరకు ట్రేస్ చేయగలిగామని, మిగిలిన కేసుల్లో కూడా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ డీజీపీ తన ట్విట్టర్ అకౌంట్ లో ప్రెస్ రిలీజ్ పెట్టారు. అంతే కాదు ఈనాడు లో 500 మిస్సింగ్ కేసులని చెప్పిన వాటిల్లో కూడా ఎంతవరకు ట్రేస్ చేయగలిగారో చెప్తూ ఒక లిస్టును కూడా ట్వీట్ చేసారు. అంతే కాదు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పోస్టులు ఫేక్ అని తన ట్విట్టర్ ద్వారా చెప్పారు.

ఇలాంటి వార్తలను షేర్ చేస్తూ ప్రజల్లో భయాందోళనలను సృష్టించవద్దని డీజీపీ తన ట్వీట్ ద్వారా అందరిని కోరారు. ఇంకా ఎవరైనా ఇలాంటివి షేర్ చేస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని కూడా వారు తెలిపారు. అలాగే, భారత ప్రభుత్వ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2016 డేటా ప్రకారం, తెలంగాణ లో 2016 లో మొత్తం 16134 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని తెలుసుకోవొచ్చు. అంటే 2016 లో రోజుకి సగటున 44 మిస్సింగ్ కేసులు నమోదైనట్టు. కాబట్టి ఇప్పుడు చెప్తున్న నంబర్లు అంత కంటే చాలా ఎక్కువగా ఏమి లేవు.

చివరగా, నగరంలో హై అలెర్ట్, అదృశ్యం అవుతున్న మహిళలు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll