Fake News, Telugu
 

1098 నెంబర్ బాధ లో ఉన్న వీధి పిల్లల సహాయార్ధం నెలకొల్పిన ఉచిత టెలి-హెల్ప్ లైన్

0

‘మీ ఇంట్లో ఎప్పుడైనా పార్టీ, ఫంక్షన్ జరిగితే ఫుడ్ ఏమైనా మిగిలితే 1098 నంబరు కు ఫోన్ చేయండి. వాళ్ళు వచ్చి ఫుడ్ తీసుకెళ్తారు.ఇది  చైల్డ్ హెల్ప్ లైన్ నంబరు’ అంటూ కొంతమంది ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు. ఈ పోస్ట్ లో చెప్పిన విషయంలో ఎంతవరకు నిజం ఉందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): 1098 హెల్ప్ లైన్ కి కాల్ చేస్తే పార్టీలో /ఫంక్షన్ లో, ఇంట్లో మిగిలిపోయిన తిండి పదార్ధాలను తీసుకెళ్తారు.

ఫాక్ట్ (నిజం): 1098 నెంబర్ బాధ లో ఉన్న వీధి పిల్లల సహాయార్ధం ‘చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్’(CIF) వారు నెలకొల్పిన ఉచిత టెలి-హెల్ప్ లైన్ సర్వీసు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

‘పార్టీ, ఫంక్షన్ లో ఫుడ్ ఏమైనా మిగిలితే, 1098 నంబరు కు ఫోన్ చేయండి. వాళ్ళు వచ్చి ఫుడ్ తీసుకెళ్తారు’ అంటూ గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో ఈ వార్త సర్క్యూలేట్ అవుతోంది. కానీ 1098 నెంబర్ బాధ లో ఉన్న వీధి పిల్లల సహాయార్ధం చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్(CIF) వారు 1996లో నెలకొల్పిన ఉచిత టెలి-హెల్ప్ లైన్ సర్వీసు. 1098 హెల్ప్ లైన్ పై తప్పుడు ప్రచారం విస్తారంగా జరగడంతో CIF వారు తమ వెబ్సైటు లో ఒక నోటీసుని కూడా పెట్టారు. నోటీసులో, ఇటువంటి వార్తలు ఈమెయిల్స్ లో ప్రచారం అవుతున్నాయని, అవి నిజం కాదని చెప్పారు. దీనికి కారణం ఈ వార్త భారతదేశంలో ‘WhatsApp’ ప్రవేశించడానికి ముందు నుండి ప్రచారంలో ఉండడం కావొచ్చు.

చివరగా, 1098 నెంబర్ బాధ లో ఉన్న వీధి పిల్లల సహాయార్ధం నెలకొల్పిన ఉచిత టెలి-హెల్ప్ లైన్.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll