Fake News, Telugu
 

జూనియర్ ఎన్.టీ.ఆర్ YSRCP మరియు జనసేన పార్టీకి మద్దతు తెలిపాడంటూ వస్తున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు

0

సినిమా నటుడు జూనియర్ ఎన్.టీ.ఆర్ ఒక పార్టీకి మద్దతు తెలుపుతునట్టుగా చాలా మంది వివిధ రకాలుగా పోస్ట్ చేస్తున్నారు. YSRCP పార్టీ కార్యకర్తలు జూనియర్ ఎన్.టీ.ఆర్ తమకు మద్దతు తెలుపుతునట్టుగా పోస్ట్ పెడితే జనసేన పార్టీ కార్యకర్తలు తమకు మద్దతు తెలుపుతున్నాడని పోస్ట్ పెట్టారు. కొందరేమో జూనియర్ ఎన్.టీ.ఆర్ చంద్రబాబు ని తిడుతున్నట్టుగా పెట్టారు. వాటిల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): జూనియర్ ఎన్.టీ.ఆర్ YSRCP కండువా వేసుకున్నాడు.

ఫాక్ట్ (నిజం): అది ఒక ఎడిటెడ్ ఫోటో. జనతా గారేజ్ సినిమా సక్సెస్ మీట్ ఫోటో తీసుకొని ఎడిట్ చేసారు. పోస్ట్ చేసిన ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే సెర్చ్ రిజల్ట్స్ లో ఒరిజినల్ ఫోటో వస్తుంది. ఆ ఫోటో జనతా గారేజ్ సినిమా సక్సెస్ మీట్ లో తీసినట్టుగా తెలుస్తుంది. కావున జూనియర్ ఎన్.టీ.ఆర్ YSRCP కండువా వేసుకోలేదు.

క్లెయిమ్ (దావా): జూనియర్ ఎన్.టీ.ఆర్ జనసేన కి మద్దతుగా  ట్వీట్ చేసాడు.

ఫాక్ట్ (నిజం): జూనియర్ ఎన్.టీ.ఆర్ జనసేనకి మద్దతుగాఎటువంటి ట్వీట్ చేయలేదు. పోస్ట్ లో ఉన్నది ఒక ఎడిటెడ్ ట్వీట్.

పోస్ట్ లోని ట్వీట్ కోసం జూనియర్ ఎన్.టీ.ఆర్ ట్విట్టర్ అకౌంట్ లో వెతికితే ఎక్కడా కూడా రాజకీయ పార్టీలకు మద్దతుగా ఈ ఎన్నికల్లో ఎటువంటి ట్వీట్ తను చేయలేదని తెలుస్తుంది. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పైన పోస్టులే కాకుండా కొందరు జూనియర్ ఎన్.టీ.ఆర్ చంద్రబాబుని విమర్శించాడని ఒక న్యూస్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ కూడా షేర్ చేస్తున్నారు. ఆ ఫేక్ న్యూస్ మీద FACTLY ఇంతకుముందే ఒక ఆర్టికల్ రాసింది.

చివరగా, జూనియర్ ఎన్.టీ.ఆర్ పలానా పార్టికి మద్దతు తెలిపాడంటూ వస్తున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll