జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ తో ఇస్లామిక్ మతబోధకుడు జాకీర్ నాయక్ అని ఒకే ఫోటోతో కూడిన పోస్ట్ ని చాలా మంది ఫేస్బుక్ యూజర్స్ షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంత వరకు నిజముందో విశ్లేషిద్దాం.
క్లెయిమ్ (దావా): జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ తో ఇస్లామిక్ మతబోధకుడు జాకీర్ నాయక్
ఫాక్ట్ (నిజం): ఆ ఫోటో లో జాకీర్ నాయక్ తో ఉన్నది మసూద్ అజర్ కాదు, మక్కా లోని ముస్లింల పవిత్ర మసీదు యొక్క ఇమామ్ ఐన అబ్దుల్ రెహమాన్ అల్-సుదయిస్. కావున పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో నిజం లేదు.
పోస్ట్ లో ఉన్న ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసినప్పుడు, 2017 లో దిగిన ఈ ఫోటో వస్తుంది. జాకీర్ నాయక్ తన ఫేస్బుక్ పేజీ లో ఈ ఫోటో ని పెట్టాడు. అంతే కాకుండా, అప్పట్లో చాలా మంది ఈ ఫోటో ని ట్విట్టర్ లో కూడా పెట్టారు.
మక్కా లోని ముస్లింల పవిత్ర మసీదు యొక్క ఇమామ్ ఐన అబ్దుల్ రెహమాన్ అల్-సుదయిస్ తో ఈ ఫోటో ని 2017 రంజాన్ మాసంలో దిగినట్టు మనకు తెలుస్తుంది. ఇదే వస్త్ర ధారణతో ఆ ఇమామ్ దిగిన ఫోటో కూడా ఆయన అధికారిక ఫేస్బుక్ పేజీలో మనం చూడొచ్చు. మక్కా, మదీనా పవిత్ర మసీదుల వ్యవహారాలు చూసుకునే కమిటీ కి కూడా అయన ప్రెసిడెంట్ అని మనం తెల్సుకోవొచ్చు. కాబట్టి ఫొటోలో ఉన్నది మసూద్ అజర్ కాదు.
చివరగా, ఆ ఫోటో లో జాకీర్ నాయక్ తో ఉన్నది మసూద్ అజర్ కాదు, మక్కా లోని ముస్లింల పవిత్ర మసీదు యొక్క ఇమామ్ ఐన అబ్దుల్ రెహమాన్ అల్-సుదయిస్.
ప్రతి వారం, మేము ‘ఏది ఫేక్, ఏది నిజం’ అనే తెలుగు యూట్యూబ్ షో చేస్తున్నాం. మీరు చూసారా?