Fake News, Telugu
 

జకీర్ నాయక్‌ను తమ దేశం విడిచిపెట్టి వెళ్ళాల్సిందిగా మలేషియా ప్రభుత్వం ఆదేశించలేదు

0

‘జకీర్ నాయక్‌ను దేశం విడిచిపెట్టి వెళ్ళాల్సిందిగా మలేషియా ప్రభుత్వం ఆదేశం’ అంటూ కొంతమంది ఫేస్బుక్ లో పోస్టు చేస్తున్నారు. ఆ పోస్టులో ఆరోపించిన విషయంలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): జకీర్ నాయక్‌ను దేశం విడిచిపెట్టి వెళ్ళాల్సిందిగా మలేషియా ప్రభుత్వం ఆదేశించింది.

ఫాక్ట్ (నిజం): మలేషియా హోం శాఖ వారు ఒక ప్రాంతీయ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జకీర్ నాయక్‌ను దేశం విడిచిపెట్టి వెళ్ళమని ఆదేశించలేదని స్పష్టం చేసింది. కావున, పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో నిజం లేదు.      

జకీర్ నాయక్‌ను దేశం విడిచిపెట్టి వెళ్ళాల్సిందిగా మలేషియా ప్రభుత్వం ఆదేశించిందా? అని గూగుల్ లో వెతికినప్పుడు, ఆ విషయం పై  “News18” వారు చేసిన ట్వీట్ లభించింది.

కానీ, ఆ విషయం గురించి ఏ ఇతర వార్తా సంస్థ కూడా ప్రచురించినట్లుగా ఆధారాలు లేవు. ఆ విషయం వాస్తవికత గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, మలేషియా ప్రధాన మంత్రి మహాతిర్ మొహమ్మద్ టర్కిష్ ఛానల్ TRT కి ఇచ్చిన ఇంటర్వ్యూ దొరికింది. జాకిర్ నాయక్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ మహాతిర్ మొహమ్మద్ ఇలా అన్నాడు “మాలేషియా జనాభా లో విభిన్న మతాల వాళ్ళు ఉంటారు, కావున మతానికి సంబంధించి అతివాద వ్యాఖ్యలు చేసేవారు మాకు అవసరం లేదు. ఇలా చూస్తే అతన్ని మేము ఇక్కడ ఉండనీయలేము. కానీ ఇంకో వైపు అతన్ని ఎక్కడికి పంపలేము, ఎందుకంటే చాలా దేశాలకి అతను వద్దు.”

మలేషియా వార్తా సంస్థ “Free Malaysia Today” వారు ప్రచురించిన ఒక కథనం ప్రకారం మలేషియా హోం శాఖ వారు ఆ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జకీర్ నాయక్‌ను మలేషియా విడిచిపెట్టి వెళ్ళమని ఆదేశించలేదని స్పష్టం చేసినట్లుగా తెలిసింది మరియు  “News18” వారు తప్పుడు సమాచారంతో కథనం ప్రచురించినట్లుగా తెలిసింది.

“Aaj tak” వార్తా సంస్థ కూడా  మలేషియా ప్రభుత్వం జకీర్ నాయక్‌ను తమ దేశం విడిచిపెట్టి వెళ్ళమని ఆదేశించలేదని ఒక కథనం ద్వారా తెలిపింది.

చివరగా, జకీర్ నాయక్‌ను తమ దేశం విడిచిపెట్టి వెళ్ళాల్సిందిగా మలేషియా ప్రభుత్వం ఆదేశించలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll