Fake News, Telugu
 

అది పుల్వామా టెర్రరిస్ట్ బ్లాస్ట్ తరువాత జరిగిన దాడి కాదు, చాలా పాత వీడియో

0

పుల్వామా బ్లాస్ట్ తరువాత భారత ప్రధాన మంత్రి మోడీ పాకిస్తాన్ పై తగిన చర్యలు తీసుకుంటామని మరియు రక్షణ దళాలకి తగిన నిర్ణయాలు తీసుకొనే పూర్తి స్వాతంత్రం ఇస్తున్నామని అన్నారు. ఈ వాక్యల తరువాత సోషల్ మీడియా లో భారత దళాలు పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద దాడి మొదలుపెట్టినట్టుగా చాలా వీడియోలు వస్తున్నాయి. ఫేస్బుక్ లో ‘ జి శివ శంకర్ రెడ్డి’ అనే వ్యక్తి భారత ఆర్మీ పాకిస్తాన్ మీద మిస్సైల్స్ లాంచ్ చేసినట్టుగా ఒక వీడియోని పోస్ట్ చేసాడు. ఆ వీడియో లో ఎంత నిజం ఉందో విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం.

క్లెయిమ్ (దావా): పాకిస్తాన్ ఉగ్రవాదుల పై మిస్సైల్స్ ఫైరింగ్ తో వేట మొదలైంది. దేవుడు దిగి వచ్చిన ఆపలేడు.

ఫాక్ట్ (నిజం):ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన వీడియోని ఇన్విడ్ సాఫ్ట్ వేర్ సహాయంతో ఫ్రేమ్స్ గా విభజించి యాన్డెక్స్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే అదే వీడియో ఒక సంవత్సరం కింద పోస్ట్ చేసినట్టుగా చాలా లింక్స్ వస్తాయి. అదే కాకుండా య్యూట్యూబ్ లో ‘tank firing in the desert – India’ అని సెర్చ్ చేస్తే రిజల్ట్స్ లో ఫేస్బుక్ లో షేర్ అవుతున్న వీడియోనే వస్తుంది. ఆ వీడియో అప్లోడ్ డేట్ చూస్తే అది పోయిన సంవత్సరం ఏప్రిల్ లో పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కావున ట్రెండింగ్ అవుతున్న వీడియో ఇప్పటిది కాదు.

చివరగా, పోస్ట్ లో చెప్పినట్టుగా వీడియో లో చూపెట్టింది పుల్వామా బ్లాస్ట్ తరువాత జరిగిన ఫైరింగ్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll