Fake News, Telugu
 

కొట్టేసిన మేఘాలయ హై కోర్టు వాఖ్యాలను తీసుకొని తమకు నచ్చినట్టుగా పెట్టి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు.

0

మేఘాలయ హైకోర్ట్ భారత్ ని హిందూ దేశంగా ప్రకటించాలి అని తీర్పు ఇచ్చినట్టుగా ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): మేఘాలయ హైకోర్ట్ – “భారత్ ని హిందూ దేశంగా ప్రకటించాలి’ 

ఫాక్ట్ (నిజం): గత సంవత్సరం డిసెంబర్ లో ఒక కేసు మీద తీర్పు ఇస్తూ ఒక-న్యాయమూర్తి ఉన్న బెంచ్ ఇండియాకి స్వాతంత్రం  వచ్చినప్పుడు హిందూ దేశంగా ప్రకటించాల్సింది అని అన్నారు. ఆ వాఖ్యలను కూడా ఈ సంవత్సరం మే నెలలో రెండు-న్యాయమూర్తులు ఉన్న బెంచ్ కొట్టేసింది. కానీ ఆ కొట్టేసిన వాఖ్యాలను తీసుకొని తమకు నచ్చినట్టుగా పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఈ విషయం పై గూగుల్ లో వెతకగా, మేఘాలయ హైకోర్టు లో ఒక-న్యాయమూర్తి ఉన్న బెంచ్ గత సంవత్సరం డిసెంబర్ నెల 10 వ తేదిన ఇచ్చిన తీర్పులో పోస్ట్ లో ఇచ్చిన విషయం మీద వాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. కావున మేఘాలయ హైకోర్టు అధికారిక వెబ్ సైట్ లో 10వ తేదిన ఇచ్చిన తీర్పు డాక్యుమెంట్ చూడగా, న్యాయమూర్తి సేన్ ఒక కేసు విషయంలో తీర్పు ఇస్తూ స్వాతంత్రం సమయంలో పాకిస్తాన్ ముస్లిం దేశంగా ప్రకటించుకుంది, మనం ఇండియాని హిందూ దేశంగా ప్రకటిస్తే బాగుండేదని అన్నారు. పోస్ట్ లో చెప్పినట్టుగా ఇప్పుడు హిందూ దేశంగా భారత్ ని ప్రకటించాలి అని అనలేదు.

న్యాయామూర్తి సేన్ చేసిన ఆ వాఖ్యాలను కూడా ఈ సంవత్సరం మే నెలలో రెండు-న్యాయమూర్తులు ఉన్న బెంచ్ కొట్టేసింది . న్యాయామూర్తి సేన్ కేసుకు సంబంధం లేని వాఖ్యలు చేసారని, ఆ వాఖ్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని రెండు-న్యాయమూర్తులు ఉన్న బెంచ్ తీర్పు ఇచ్చింది.

చివరగా, కొట్టేసిన మేఘాలయ హై కోర్టు వాఖ్యాలను తీసుకొని తమకు నచ్చినట్టుగా పెట్టి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll