కర్ణాటక లోని తుంకూర్ దగ్గర జరిగిన కాంగ్రెస్ ర్యాలీ లో పాకిస్తాన్ జెండా ఊపారంటూ ఈరోజు ఒక పోస్ట్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లోని నిజానిజాలను ఒకసారివిశ్లేషిద్ధాం.
ఈ పోస్ట్ యొక్క ఆర్చివ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.
క్లెయిమ్ (దావా): కర్నాటక లో జరిగిన కాంగ్రెస్ ర్యాలీ లో పాకిస్తాన్ జెండా ఊపారు
.ఫాక్ట్ (నిజం): ఆ వీడియో కనుక మనం క్షుణ్ణంగా గమనిస్తే అందులో ఉన్నది పాకిస్తాన్ జెండా కాదు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ జెండా అని అర్థం అవుతుంది. కావున పోస్ట్ చెప్పిన విషయం లో ఎటువంటి నిజం లేదు.
పోస్ట్ లో షేర్ చేసిన వీడియో ని జాగ్రత్తగా గమనిస్తే అందులో ఉన్నది పాకిస్తాన్ జెండా కాదు. ఆ వీడియో లో ఉన్నదీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ జెండా. గతం లో కూడా IUML జండా ని పాకిస్తాన్ తో పోలుస్తూ కొన్ని ఫేక్ వార్తలు వచ్చాయి. ఈ క్రింద రెండు జెండాలకూ ఉన్న తేడా గమనించవొచ్చు.
కుడి వైపు ఉన్నది పాకిస్తాన్ జెండా. అందులో అర్ధ చెంద్రాకారం కుడి వైపు తిరిగి ఉంటుంది మరియు జెండా లో ఎడమవైపు తెలుపు రంగు స్ట్రిప్ ఉంటింది. చివరగా కర్నాటక లో జరిగిన కాంగ్రెస్ ర్యాలీ లో పాకిస్తాన్ జెండా ఊపారు అంటూ చెప్పిన పోస్ట్ లో ఎటువంటి నిజం లేదు