Fake News, Telugu
 

ఐఏఎఫ్ దాడుల్లో పాల్గొన్న వాయుసేనా సిబ్బంది కి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు

0

పుల్వామా ఘటనకి ప్రతీకార చర్యగా భారత వాయుసేన పాక్ పై దాడులకు సంబంధించి ‘ప్రజాస్వామ్యం’ అనే ఫేస్బుక్ పేజీ  ‘కేవలం 30 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేసి తిరిగి వచ్ఛిన 12 మంది భారతీయ వాయుసేన జవాన్లు వీరే’ అంటూ  పోస్ట్ చేసింది. పోస్ట్ లో ఎంతవరకు నిజాలు ఉన్నాయో చూద్దాం .

క్లెయిమ్ (దావా):పోస్ట్ చేసిన ఫోటోల్లో పాక్ పై దాడులు నిర్వహించిన ఐఏఎఫ్ జవాన్లు ఉండడం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో పెట్టిన 5 ఫోటోలను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు అవి పాత ఫోటోలు గా తేలాయి. ఆ 5 (1,2,3,4,5) ఫోటోలు ఒక్కోటి ఒక్కో సందర్భానికి సంబంధించినవి . భారత వైమానిక దళం గోప్యత కారణంగా  బాలాకోట్ దాడుల్లో పాల్గొన్న జవాన్ల  పేర్లను  ఎక్కడా కూడా ఇప్పటి వరకు వెల్లడించినట్టుగా సమాచారం లేదు. కావున ఐఏఎఫ్ దాడుల్లో పాల్గొన్న జవ్వాన్ల ఫొటోల్లో ఉన్న వ్యక్తులేనా కాదా అని ఖఛ్చితంగా చెప్పలేము.

చివరగా, వాయు దాడుల్లో పాల్గొన్న జవ్వాన్లు ఫొటోల్లో ఉన్న వ్యక్తులేనా కాదా అని ఖఛ్చితంగా చెప్పలేము. వాయు దాడుల్లో  పాల్గొన్న జవ్వాన్లకి సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు ఎవరూ అధికారికంగా వెల్లడించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll