Fake News, Telugu
 

ఆ వీడియో లో ఉన్నదీ పాకిస్తాన్ యుద్ధ విమానం కాదు, బడ్గాం లో కూలిన భారత్ ఛాపర్

0

పాకిస్తాన్ నుండి భారత మీద దాడి చేయడానికి వచ్చిన యుద్ధ విమానాల్లో ఒక విమానాన్ని భారత సైన్యం కూల్చేసిందని ఒక వీడియోని ‘నిర్మల్’ అనే పేజీ ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఎంత వరకు నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం.

క్లెయిమ్ (దావా): భారతదేశం పై దాడికి వచ్చిన మూడు యుద్ధ విమానాల్లో ఒక యుద్ధ విమానాన్ని కూల్చిన భారత సైన్యం.

.ఫాక్ట్ (నిజం): వీడియో లో కూలిపోయింది భారత వాయు సేనకి సంభందించిన Mi-17  ఛాపర్. పాకిస్తాన్ యుద్ధ విమానం కాదు.

పోస్ట్ చేసిన వీడియో ని ఇన్విడ్ సాఫ్ట్ వేర్ సహాయంతో ఫ్రేమ్స్ గా విభజించి గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే ఆ వీడియో బడ్గాం లో కుప్పకూలిన ఛాపర్ కి సంభందించినదని తెలుస్తుంది. గూగుల్ లో ‘Budgam Chopper Crash’ అని సెర్చ్ చేస్తే ఎన్.డి.టీ.వీ ఆర్టికల్ ఒకటి వస్తుంది. దాని ప్రకారం బడ్గాం లో భారత వాయు సేన కి చెందిన Mi-17 ఛాపర్ ఒకటి  ఫిబ్రవరి 27న కుప్పకూలింది. ఆ దుర్ఘటన కి కారణం భారత ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు కానీ ఆ ఘటనలో ఆరుగురు భారత వాయుసేన ఆఫీసర్స్ మృతి చెందారు.

చివరగా, వీడియో లో కుప్పకూలింది పాకిస్తాన్ యుద్ధ విమానం కాదు. అది భారత కి చెందిన Mi-17 ఛాపర్.

Share.

About Author

Comments are closed.

scroll