Fake News, Telugu
 

చైనా ఆర్మీ ని భారత భూభాగంలోకి రానివ్వకుండా ఆపుతున్న ఇండియన్ ఆర్మీ అంటూ పెట్టినది ఒక పాత వీడియో

0

‘చైనా ఆర్మీ ని భారత భూభాగంలోకి రానివ్వకుండా ఆపుతున్న ఇండియన్ ఆర్మీ’ అంటూ ఒక వీడియోని ఫేస్బుక్ లో  పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్టు లో  ఎంతవరకు నిజం ఉందో ఓసారి విశ్లేషిద్దాం .

క్లెయిమ్ (దావా): చైనా ఆర్మీ ని భారత భూభాగం లోకి రానివ్వకుండా అడ్డుకున్న  ఇండియన్ ఆర్మీ

.ఫాక్ట్ (నిజం): భారత్- చైనా సరిహద్దు వెంబడిగా ఉన్న గోడని చైనా ఆర్మీ వారు కూల్చడానికి ప్రయత్నించినప్పుడు భారత ఆర్మీ  అడ్డుకున్నప్పటి 4 సంవత్సరాల క్రితం వీడియో. కావున ఇటువంటి  పోస్ట్ ఇప్పుడున్న పరిస్థితులలో అందరిని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది.

ఫేస్బుక్ పోస్ట్ లో పెట్టిన వీడియోని  ఇన్విడ్ ఎక్స్టెన్షన్ లో విభజించగా వచ్చిన ఫ్రాగ్మెంట్స్ ని రివర్స్  ఇమేజ్ సెర్చ్ చేయాగా వచ్చిన సమాచారం ఆధారంగా వెతికినప్పుడు పోస్ట్ లో అప్లోడ్ చేసిన  వీడియో యూట్యూబ్ లో  లభించింది. భారత్- చైనా సరిహద్దు వెంబడిగా ఉన్న గోడని చైనా ఆర్మీ వారు కూల్చడానికి ప్రయత్నించినప్పుడు భారత ఆర్మీ అడ్డుకున్నట్లుగా ఈ వీడియోలో   పేర్కొని ఉంది. దీనిని ZEE News వారు  ఆగష్టు  25, 2014 న  యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు.

చివరగా, పోస్ట్ లో షేర్ చేసిన వీడియో చాలా పాతది మరియు ఇప్పుడు ఉన్న పరిస్థితులకి సంబందించినది కాదు. కావున ఇటువంటి  పోస్ట్ ఇప్పుడున్న పరిస్థితులలో అందరిని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll