Fake News, Telugu
 

‘ఆర్మీ వాహనాలకి ఇంధనం నిరాకరించిన వయనాడ్ లోని పెట్రోల్ బంకుల యజమానులు’ అని వస్తున్న వార్తల్లో నిజం లేదు

0

కేరళలో వరద బాధితులకు సహాయం అందించడానికి వచ్చిన మన దేశ ఆర్మీ వాహనాలకు వయనాడ్ లోని పెట్రోల్ బంకుల యజమానులు ఇంధనం ఇవ్వడానికి నిరాకరించారని చెప్తూ ఉన్న ఒక పోస్ట్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : రాహుల్ గాంధీ ఎం.పీ. గా గెలిచిన వయనాడ్ లో భారత దేశ ఆర్మీ వాహనాలకు ఇంధనం నిరాకరించిన స్థానిక పెట్రోల్ బంకుల యజమానులు.    

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో చెప్పినట్టుగా వయనాడ్ లోని పెట్రోల్ బంకుల యజమానులు
భారత దేశ ఆర్మీకి ఇంధనం నిరాకరించలేదు. అది ఒక ‘ఫేక్ న్యూస్’ అని వయనాడ్ జిల్లా కలెక్టర్ ఆఫీసు వారు మరియు సుల్తాన్ బతేరి భారత్ పెట్రోలియం వారు FACTLY కి తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.    

పోస్ట్ లోని ఫోటో చూస్తే ఆ వార్త ‘Kerala Kaumudi’ వెబ్ సైట్ నుండి తీసుకున్నట్టుగా చూడవచ్చు. పోస్ట్ లోని వార్తా గురించి ఆ వెబ్ సైట్ లో వెతకగా, వారు ముందు ప్రచురించిన వార్తను మార్చినట్టుగా చూడవచ్చు. అసలు అలాంటి సంఘటన ఏమీ జరగలేదని, అది ఒక ఫేక్ న్యూస్ అని సుల్తాన్ బతేరి పెట్రోల్ బంకు లో పని చేసే ఒక ఉద్యోగి చెప్పినట్టుగా ఆ ఆర్టికల్ లో చదవచ్చు. అంతేకాదు, పోలీసు వారు కూడా పెట్రోల్ బంకుల మీద ఎవరు కూడా ఈ విషయం పై ఫిర్యాదు చేయలేదని చెప్పినట్టుగా చూడవచ్చు.

ఈ విషయం గురించి తెలుసుకోవడానికి వయనాడ్ జిల్లా కలెక్టర్ ఆఫీసుకి FACTLY ఫోన్ చేయగా, పెట్రోల్ బంకులు ఆర్మీ వాహనాలకు ఇంధనం నిరాకరించినట్టుగా వస్తున్న వార్తలు ‘ఫేక్’ అని వారు తెలిపారు. అంతేకాదు, సుల్తాన్ బతేరి లోని భారత్ పెట్రోలియం బంకు కి FACTLY ఫోన్ చేయగా, వారు కూడా ఈ వార్త లో నిజం లేదని తెలిపారు.

వైరల్ అవుతున్న ఈ ఫేక్ వార్త మీద వయనాడ్ జిల్లా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ వారు పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదు కాపీని Altnews ఆర్టికల్ లో చూడవచ్చు.

చివరగా, ఆర్మీ వాహనాలకి ఇంధనం ఇవ్వడానికి వయనాడ్ లోని పెట్రోల్ బంకుల యజమానులు నిరాకరించారని వస్తున్న వార్తల్లో నిజం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll