అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఒక పిల్ల వాడిని నీకు ఎవరు ఇష్టమని అడిగినప్పుడు తనకు మోడీ ఇష్టమని చెప్పినట్టుగా ఒక వీడియోని కొందరు ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంత నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం.
క్లెయిమ్ (దావా): ట్రంప్: “ నీకు అందరికంటే ఎవరు ఇష్టం?”. పిల్లోడు: “మోడీ”
ఫాక్ట్ (నిజం): య్యూట్యూబ్ లో ‘ Trump with Little Kid’ అని సెర్చ్ చేస్తే ‘ఫాక్స్10’ న్యూస్ ఛానల్ వారు 2016 లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి వస్తుంది. ఆ వీడియో మరియు ఫేస్బుక్ లో షేర్ అవుతున్న వీడియో ఒకటే కానీ ఫేస్బుక్ లో షేర్ అవుతన్న వీడియోలో ఆడియోని మార్చేసారు. నిజానికి ట్రంప్ ఆ పిల్ల వాడిని మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళతావ లేక ట్రంప్ తో ఉంటావా అని అడిగినప్పుడు ఆ పిల్లోడు ట్రంప్ అని అన్నాడు
చివరగా, వీడియోలో ఆడియోని మార్చేసారు. ఆ పిల్లోడు మోడీ అని అనలేదు.