Fake News, Telugu
 

నిజ నిర్ధారణ: జవాన్ మృతిదేహం దగ్గర బీ.జే.పీ నాయకులు నిజంగా నవ్వరా?

0

జవాన్ మృతిదేహం దగ్గర బీ.జే.పీ నాయకులు నవుతున్నట్టు ఒక వీడియోని కొంత మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ‘CPIM VIZAG’ అనే ఫేస్బుక్ పేజీ పోస్ట్ చేసిన ఆ వీడియోని ఇప్పటివరకు 1300 మంది షేర్ చేసారు. ఆ వీడియో లో ఎంత వరకు నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం

క్లెయిమ్ (దావా): జవాన్ మృతిదేహం దగ్గర నవ్వుతున్న బీ.జే.పీ నాయకులు

ఫాక్ట్ (నిజం): పోస్ట్ చేసిన వీడియో ని ఇన్విడ్ సాఫ్ట్ వేర్ సహాయం తో ఫ్రేమ్స్ గా విభజించి యాన్డెక్స్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే గత సంవత్సరం అక్టోబర్ లో కాంగ్రెస్ నాయకుడు ఎన్.డి.తివారి గారు చనిపోయినప్పుడు తీసిన వీడియో వస్తుంది. అప్పట్లో కూడా సంతాప సభ లో నవ్వినందుకు ఆ వీడియో వైరల్ అయ్యింది. కానీ ఇప్పుడు అదే వీడియో ని మళ్ళీ తీసుకొని జవాన్ మృతిదేహం ముందు నవ్వినట్టు చూపెడుతున్నారు.

చివరగా, జవాన్ మృతిదేహం దగ్గర బీ.జే.పీ నాయకులు నవ్వలేదు. అది ఒక పాత వీడియో.

Share.

About Author

Comments are closed.

scroll