Fake News, Telugu
 

అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలు లాయర్లయ్యాక తమకు కావాల్సినట్టుగా రాజ్యాంగాన్ని మార్చుకుందాం అని అనలేదు

0

ముస్లిం సోదరులరా మీరు లాయర్లు అవండి.. డాక్టర్,ఇంజనీర్ చాలు,ఎందుకంటే సుప్రీం కోర్టులో మనకు కావాల్సినట్టు రాజ్యాంగాన్ని మార్చుకుని RSS సంఘ్ పరివార్ ను నాశనం చేయొచ్చు..” అని అసదుద్దీన్ ఒవైసీ తన ప్రసంగంలో అన్నాడని అందుకు సంబంధించిన వీడియో అంటూ పెట్టిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో చేసిన ఆరోపణల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): అసదుద్దీన్ ఒవైసీ ముస్లిం వర్గీయులు లాయర్లయ్యాక తమకు కావాల్సినట్టుగా రాజ్యాంగాన్ని మార్చుకుందాం అని అన్నాడు. 

ఫాక్ట్ (నిజం): వీడియోలో అసదుద్దీన్ ఒవైసీ ముస్లిం వర్గీయులు కాన్స్టిట్యూషనల్ లాయర్లయ్యాక రాజ్యాంగాన్ని రక్షించుకోవడం గురించి మాట్లాడుకుందాం అని అన్నాడు. కావున, ఒవైసి తన ప్రసంగంలో రాజ్యాంగాన్ని మార్చుకుందామని అన్నాడని ప్రచారం చేస్తూ ప్రక్కద్రోవ పట్టిస్తున్నారు.     

పోస్టులో పెట్టిన వీడియోలో ఒవైసీ “నవజెవానో మై ఆప్సే అప్పీల్ కర్ రహాహూన్.. గుజరుగూ మై ఆప్సే గుజారిష్ కర్ రహాహూన్… ఆప్కె బచ్చి ఔర్ బచ్చియొన్ కో కాన్స్టిట్యూషన లాయర్ బనావో అబ్ బహుత్ హోగయా డాక్టర్,ఇంజనీర్… బహుత్ హోగయా చమ్డేకా కారోబార్ ఆప్ కార్లియే హైన్.. ఉస్కీ జరూరత్ నహీ హై.. ఆప్ కాన్స్టిట్యూషన్ లాయర్ బనావో.. వకీల్ బనావో.. జిస్కో సంవిధాన్ మాలూం.. జిస్కో కాన్స్టిట్యూషన్ మాలూం.. అగర్ హమారే కమ్యూనిటీ కే సౌ బచ్చే కాన్స్టిట్యూషన్ లాయర్ కే ఎక్స్పర్ట్ హోజాయే.. ఔర్ సౌ మేసే బీస్ ఢిల్లీ మే సుప్రీమ్ కోర్ట్ మే రెహ్ కర్ ‘కాన్స్టిట్యూషన్ కో ప్రొటెక్ట్ కర్నేకి బాత్ కరెంగే’ తొహ్ ఎహ్ సంఘ్ పరివార్ కె లోగోంకీ నీంధ్ హరామ్ హో జాయేగి.. హమ్కో కాన్స్టిట్యూషన్ లాయర్ పైధా కర్నా హే.. ఔర్ అల్లా నే  హంకో దియా హే.. హమారే పాస్ కాబిల్ తరీం బచ్చి ఔర్ బచ్చియా హే.. ఇన్కో ఇంజనీర్ ఔర్  డాక్టర్ కో చోడ్కర్ ఇన్కో కాన్స్టిట్యూషన్ లాయర్ బనావో.. అప్నా కయాజాద్కొ మజ్బూర్ కరో” అని ప్రసంగించారు. 

ఆ వీడియోలో ఒవైసీ తాను ప్రసంగించేటప్పుడు  ‘రాజ్యాంగాన్ని రక్షించుకోవడం గురించి మాట్లాడుకుందాం’ (కాన్స్టిట్యూషన్ కో ప్రొటెక్ట్ కర్నేకి బాత్ కరెంగే) అని 0:25 దగ్గర అనడం వినవచ్చు.

చివరగా, అసదుద్దీన్ ఒవైసీ ముస్లిం వర్గీయులు లాయర్లయ్యాక తమకు కావాల్సినట్టుగా రాజ్యాంగాన్ని మార్చుకుందాం అని అనలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll