Fake News, Telugu
 

అది పుల్వామా టెర్రరిస్ట్ దాడి వీడియో కాదు, 2007 లో ఇరాక్ లో జరిగిన బాంబు బ్లాస్ట్ వీడియో

0

ఫేస్బుక్ లో ఒక వీడియోని జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా లో జరిగిన ఉగ్రవాద దాడిగా చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో కొన్ని వ్యాన్లు వెళ్తుండగా పెద్ద బ్లాస్ట్ అవుతుంది. కావున అది పుల్వామా బ్లాస్ట్ గా చాలా మంది అనుకుంటున్నారు. ఆ వీడియో నిజంగా పుల్వామా బ్లాస్ట్ దో కాదో విశ్లేషిద్దాం.

క్లెయిమ్ (దావా):వీడియోలో ఉన్నది పుల్వామాలో CRPF జవాన్ల పై జరిగిన దాడి.

ఫాక్ట్ (నిజం):షేర్ చేసిన వీడియోని ఫ్రేమ్స్ గా విభజించి గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే అది 2007 లో ఇరాక్ లోని తాజీ ఆర్మీ బేస్ దగ్గర జరిగిన బ్లాస్ట్ అని తెలుస్తుంది. అలానే య్యూట్యూబ్ లో ‘taji iraq huge explosion’ అని సెర్చ్ చేస్తే పుల్వామా బ్లాస్ట్ గా చూపెడుతున్న ఇరాక్ బ్లాస్ట్ వీడియో వస్తది; ఆ వీడియోలో పైన టైం స్టాంప్ చూస్తే 2007 లోజరిగిన బ్లాస్ట్ అని నిర్ధారించుకోవచ్చు. ఆ టైం స్టాంప్ ని ఫేస్బుక్ లో షేర్ అవుతున్న వీడియోలో క్రాప్ చేసారు. ఇదే వీడియో ప్రతి ఏడాది ఎదో ఒక దగ్గర జరిగిన బ్లాస్ట్ లాగ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. 2007 నుంచి యూట్యూబ్ లో ఈ వీడియో చక్కర్లు కొడ్తుంది

చివరగా, పుల్వామా బ్లాస్ట్ గా షేర్ అవుతున్న వీడియో వాస్తవానికి ఇరాక్ లో జరిగిన బ్లాస్ట్ వీడియో.

Share.

About Author

Comments are closed.

scroll