Fake News, Telugu
 

కాంగ్రెస్ కార్యాలయంలో మొఘల్ చక్రవర్తి బాబర్ ఫోటో అంటూ షేర్ చేస్తున్నది డిజిటల్‌గా ఎడిట్ చేసిన ఫోటో

0

రాహుల్ గాంధీ బాబర్ వారసుడు అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది . ఈ ఫోటోలో  రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కూర్చొని ఉన్న గదిలో మొఘల్ చక్రవర్తి బాబర్ ఫోటో ఉండడం చూడొచ్చు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ ఫోటోకు సంబంధించి నిజమెంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కూర్చొని ఉన్న గదిలో మొఘల్ చక్రవర్తి బాబర్ ఫోటో ఉంది.

ఫాక్ట్(నిజం): అసలు ఫోటోలో రాహుల్ గాంధీ వెనకాల ఉన్నది మహాత్మా గాంధీ ఫోటో. ఈ ఫోటో 2017లో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్న సమయంలో తీసింది. దీనిని డిజిటల్‌గా ఎడిట్ చేసి మహాత్మా గాంధీ ఫోటో స్థానంలో బాబర్ ఫోటోను చేర్చారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ప్రస్తుతం షేర్ అవుతున్న ఈ ఫొటోలో రాహుల్ గాంధీ వెనకాల గోడపై ఉన్నది మొఘల్ చక్రవర్తి బాబర్ ఫోటో కాదు. దీనిని డిజిటల్ గ ఎడిట్ చేసి రూపొందించారు.

ఈ ఫొటోకు సంబంధించి మరింత సమాచారం కోసం ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా దీని అసలు ఫోటోను పబ్లిష్ చేసిన వార్తా కథనం మాకు కనిపించింది. ఈ అసలు ఫోటోలో రాహుల్ గాంధీ వెనకాల ఉన్నది మహాత్మ గాంధీ ఫోటో. ఈ కథనం ప్రకారం 2017లో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్న సమయంలో తీసింది. 

ఇదే ఫోటోను 2017లో ప్రచురించిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ వీటిలో కూడా రాహుల్ గాంధీ వెనకాల ఉన్నది మహాత్మా గాంధీ ఫోటో అని స్పష్టంగా తెలుస్తుంది. దీన్నిబట్టి ఈ ఫోటోను డిజిటల్‌గా ఎడిట్ చేసి మహాత్మా గాంధీ ఫోటో స్థానంలో బాబర్ ఫోటోను అతికించారని అర్ధమవుతుంది.

చివరగా, కాంగ్రెస్ కార్యాలయంలో మొఘల్ చక్రవర్తి బాబర్ ఫోటో అంటూ షేర్ చేస్తున్నది డిజిటల్‌గా ఎడిట్ చేసిన ఫోటో. 

Share.

About Author

Comments are closed.

scroll