వికీలీక్స్ వారు SWISS బ్యాంకుల్లో నల్లధనం ఉన్నవారి జాబితాను ప్రచురించిందని చెప్తూ 30 పేర్లతో ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

క్లెయిమ్ (దావా): వికీలీక్స్ SWISS బ్యాంకులో నల్లధనం ఉన్నవారి యొక్క మొదటి జాబితాను (30 పేర్లు) ప్రచురించింది.
ఫాక్ట్ (నిజం): వికీలీక్స్ వారు SWISS బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న 30 భారతీయుల పేర్లతో ఉన్న ఎలాంటి జాబితాని ఎప్పుడూ ప్రచురించలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని జాబితా గురించి వికీలీక్స్ వెబ్ సైట్ లో వెతకగా, అలాంటి జాబితా ఎక్కడా కూడా దొరకదు. 2011 లో వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అస్సంజ్ మాట్లాడుతూ SWISS బ్యాంకుల్లో అత్యధికంగా భారతీయుల డబ్బులే ఉన్నాయని అన్నాడు. అంతే కానీ భారతీయుల పేర్లతో ఎటువంటి జాబితా రిలీజ్ చేయలేదు. వికీ లీక్స్ వారు పోస్ట్ లో లాంటి ఒక భారతీయ జాబితాని ఫేక్ అని తమ అధికారిక ఫేస్బుక్ మరియి ట్విట్టర్ అకౌంట్ల ద్వారా 2011 లోనే చెప్పారు.
WARNING: WikiLeaks and Indian black money: The following is a FAKE image and never appeared on WikiLeaks http://t.co/Dwbpc3P
— WikiLeaks (@wikileaks) August 5, 2011
చివరగా, వికీ లీక్స్ వారు SWISS బ్యాంకులో నల్లధనం ఉన్న 30 భారతీయుల పేర్లతో ఎటువంటి జాబితాని ప్రచురించలేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?