Fake News, Telugu
 

వాహనదారులు టోల్ బూత్ కి 12 గంటల లోపు తిరిగి వస్తే టోల్ మినహాయింపు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు

1

Update (24 August 2022):
12 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే ఎలాంటి టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని PIB తమ ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది.

Published (26 March 2019):

ఫేస్బుక్ లో ‘వాహనదారులు టోల్ బూత్ కి 12 గంటల లోపు తిరిగి వస్తే వారు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు’  అంటూ ఒక పోస్ట్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు.  ఆ పోస్ట్  లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్చివ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్ (దావా): వాహనదారులు టోల్ బూత్ కి 12 గంటల లోపు తిరిగి వస్తే వారికి  టోల్ మినహాయింపు

.ఫాక్ట్ (నిజం): పైన పేర్కొన్న విషయం గురించి  జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వారి  అధికారిక లేఖ కానీ  రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారి ప్రస్తావన కానీ ఎక్కడా లేదు. అందువల్ల పోస్ట్ లో ఆరోపించిన విషయాల్లో  వాస్తవం లేదు.

జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ‘వాహనదారులు టోల్ బూత్ కి 12 గంటల లోపు తిరిగి వచ్చినచో వారికి  టోల్ మినహాయింపు’ అనే అంశం కై శోధించినప్పుడు వారు ఎటువంటి లేఖ జారీ చేయలేదు అని తెలిసింది. పోస్ట్ లో ప్రకటన శ్రీ నితిన్ గడ్కరీ పేరు మీద ఉంది.  కానీ ఆయన ఈ విషయానికి  సంబంధించి మీడియాలో గాని, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో కానీ ప్రస్తావించినట్టుగా లేదు. గత 2 సంవత్సరాల నుండి ఇటువంటి వార్తలు WhatsApp మరియు ఫేస్బుక్ లలో పంపిణీలో ఉన్నాయి. గత ఏడాది ఇదే సందేశం వైరల్ అయినప్పుడు, INDIA TODAY వారు  శ్రీ నితిన్ గడ్కారీ కార్యాలయాన్ని సంప్రదించినప్పుడు , అటువంటి ఆర్డర్ లేదా ప్రకటన యొక్క ఉనికిని నిరాకరించింది.

చివరగా , వాహనదారులు టోల్ బూత్ కి 12 గంటల లోపు తిరిగి వస్తే వారికి  టోల్ మినహాయింపు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు.

Share.

About Author

1 Comment

  1. sai manikanta on

    ఆ వ్యక్తి ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ ఫాల్స్ న్యూస్ అయ్యి ఉండవచ్చు. కానీ నిజానికి టోల్ గేట్స్ దగ్గర అలాంటి బోర్డులు ఖచ్చితంగా ఉండాలి. సంవత్సరాలు సంవత్సరాలు టోల్ వసూలు చేసుకుంటున్నారు కానీ రోడ్స్ అస్సలు వెయ్యట్లేదు.

scroll