సినీనటుడు షారుఖ్ ఖాన్ ఎంఐఎం పార్టీకి మద్దతుగా షర్టు వేసుకున్నాడని ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

క్లెయిమ్ (దావా): ‘Vote for MIM’ అని ఉన్న షర్టుని వేసుకున్న షారుఖ్ ఖాన్.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటో ఫోటోషాప్ చేయబడింది. ఒరిజినల్ ఫోటోలో ‘Vote for MIM’ అని షారుఖ్ ఖాన్ షర్టు పై రాసి ఉండదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
పోస్ట్ లోని ఫోటోని క్రాప్ చేసి యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, పోస్ట్ లో ఉన్న ఫోటో లాంటి ఫోటోలే సెర్చ్ రిజల్ట్స్ లో చాలా వస్తాయి. కానీ, ఆ ఫోటోల్లో షారుఖ్ ఖాన్ వేసుకున్న షర్టు మీద ‘Vote for MIM’ అని రాసి ఉండదు. కావున ఫోటోషాప్ సాఫ్ట్ వేర్ సహాయంతో ఫోటోని ఎడిట్ చేసి ‘Vote for MIM’ అని షారుఖ్ ఖాన్ షర్టు మీద రాసారు.

అంతేకాదు, 2018 లో ‘హిందుస్తాన్ టైమ్స్’ వారు తప్పుడు వార్తలపై రాసిన ఒక ఆర్టికల్ లో పోస్ట్ లోని ఫోటో ఎడిట్ చేయబడినది అంటూ రాసారు.

చివరగా, ‘Vote for MIM’ అని ఉన్న షర్టు ని షారుఖ్ ఖాన్ వేసుకోలేదు. అది ఒక ఎడిటెడ్ ఫోటో.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?