Fake News, Telugu
 

సిగ్నలింగ్ ఆధునీకరణ పనులలో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలను వారం రోజులు రద్దు చేసినట్టుగా జరుగుతున్న ప్రచారం తప్పు

0

సిగ్నలింగ్ ఆధునీకరణ పనులలో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్లో 20 సెప్టెంబర్ నుండి 28 సెప్టెంబర్ 2022 వరకు రైళ్ల రాకపోకలను పూర్తిగా రద్దు చేశారు, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతోంది. సుమారు తొమ్మిది రోజులపాటు 118 రైళ్లు పూర్తి రద్దు, పాక్షిక రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఎం.యల్వేందర్‌ యాదవ్‌ తెలిపారంటూ ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముండో చూద్దాం.    

క్లెయిమ్: సిగ్నలింగ్ ఆధునీకరణ పనులలో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్లో 20 సెప్టెంబర్ నుండి 28 సెప్టెంబర్ 2022 వరకు రైళ్ల రాకపోకలను పూర్తిగా రద్దు చేశారు.

ఫాక్ట్ (నిజం): సిగ్నలింగ్ ఆధునీకరణ పనులలో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్లో 20 సెప్టెంబర్ నుండి 28 సెప్టెంబర్ 2022 రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్టు విజయవాడ డివిజనల్ మేనేజర్ గానీ దక్షిణ మధ్య రైల్వే గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం విజయవాడ రైల్వే యార్డులో ఎలాంటి నాన్-ఇంటర్ లాకింగ్ పనులు జరగడం లేదని, దీనిపై ప్రచారంలో ఉన్న ఫేక్ మెసేజిలను నమ్మవద్దని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం వెతికితే, సిగ్నలింగ్ ఆధునీకరణ పనులలో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్లో 20 సెప్టెంబర్ నుండి 28 సెప్టెంబర్ 2022 రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్టు విజయవాడ డివిజనల్ మేనేజర్ గానీ దక్షిణ మధ్య రైల్వే గానీ ఎటువంటి ప్రకటన చేయలేదని తెలిసింది. విజయవాడ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలకు రద్దుకు సంబంధించి వాల్తేరు డివిమ్ కూడా ఎటువంటి ట్వీట్లు చేయలేదు.

దక్షిణ మధ్య రైల్వే 24 సెప్టెంబర్ 2022 నాడు ప్రకటించిన స్పెషల్ ట్రైన్ల వివరాలలో 25 సెప్టెంబర్ 2022 నాడు సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్ళిన ట్రైన్‌ విజయవాడ రైల్వే స్టేషన్లో స్టాప్ ఉన్నట్టు స్పష్టంగా తెలిపారు.

విజయవాడ రైల్వే స్టేషన్లో 20 సెప్టెంబర్ నుండి 28 సెప్టెంబర్ 2022 వరకు రైళ్ల రాకపోకల రద్దుకు సంబంధించి  ఇంటర్నెట్లో జరుగుతున్న ఈ ప్రచారాల గురించి రైల్వే అధికారాలు స్పంధించారు. ప్రస్తుతం విజయవాడ రైల్వే యార్డులో ఎలాంటి నాన్-ఇంటర్ లాకింగ్ పనులు జరగడం లేదని, దీనిపై ప్రచారంలో ఉన్న ఫేక్ మెసేజిలను నమ్మవద్దని రైల్వే అధికారులు తెలిపారు. కొండపల్లి పరిధిలో జరిగిన ఇంటర్ లోకకినగ వ్యవస్థ పనులు సెప్టెంబర్ 20వ తేదీలోపే పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో రైళ్లు రద్దయినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజయవాడ రైల్వే డివిజన్ ప్రజాసంబంధాల అధికారి మీడియాకు ప్రకటించారు.

అయితే, రైల్వే కార్యచరణాలలో భాగంగా 10, 11 మరియు 12 సెప్టెంబర్ తేదీలలో విజయవాడ మీదుగా వెళ్ళే కొన్ని రైలులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే 09 సెప్టెంబర్ 2022 నాడు ట్వీట్ చేసింది. 

అంతే కాదు, 2016లో ప్రచురితమైన ఒక వార్తని ఇప్పుడు రైళ్లు రద్దు అన్న మెసేజితో మళ్ళీ షేర్ చేస్తున్నట్టు కూడా మా పరిశోధనలో తేలింది.

చివరగా, సిగ్నలింగ్ ఆధునీకరణ పనులలో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్లో 20 సెప్టెంబర్ నుండి 28 సెప్టెంబర్ 2022 వరకు రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్టుగా ప్రచారం చేస్తున్న వార్తలు తప్పు. 

Share.

About Author

Comments are closed.

scroll