Fake News, Telugu
 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో BJP సెంచరీ కొట్టబోతుందని BRS నాయకుడు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగా షేర్ చేస్తున్న ఈ వీడియో ఎడిట్ చేయబడినది

0

త్వరలో జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో BJP సెంచరీ కొట్టబోతుందని, BRS పార్టీ డకౌట్ కాబోతుందని, కాంగ్రెస్ రనౌట్ అవబోతుందని BRS హుజూరాబాద్ అభ్యర్ధి కౌశిక్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యలు చేసారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో BJP సెంచరీ కొట్టబోతుంది, BRS పార్టీ డకౌట్ కాబోతుంది, కాంగ్రెస్ రనౌట్ అవబోతుందని బిఆర్ఎస్ నాయకుడు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. రానున్న 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో BRS పార్టీ సెంచరీ కొట్టబోతుందని, BJP డకౌట్ కాబోతుందని, కాంగ్రెస్ రనౌట్ అవబోతుందని కౌశిక్ రెడ్డి 20 అక్టోబర్ 2023 నాడు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో తెలిపారు. అసలు వీడియోలోని ఆడియోని ఎడిట్ చేసి ఈ వీడియోని రూపొందించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని BRS హుజూరాబాద్ అభ్యర్ధి కౌశిక్ రెడ్డి 21 అక్టోబర్ 2023 నాడు తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. అసలు వీడియోలో కౌశిక్ రెడ్డి, “BRS పార్టీ సెంచరీ కొట్టబోతుంది, BJP పార్టీ డకౌట్ కాబోతుంది, కాంగ్రెస్ రనౌట్ అవబోతుంది”, అని పేర్కొన్నారు.

20 అక్టోబర్ 2023న కౌశిక్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్‌లోని దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ ప్రెస్ మీట్‌లో కౌశిక్ రెడ్డి యొక్క పూర్తి ప్రసంగం వీడియోని ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలోని 24:01 నిమిషాల దగ్గర కౌశిక్ రెడ్డి, “మల్లొకసారి మీకు చెబుతున్న. BRS పార్టీ సెంచరీ కొట్టబోతుంది, BJP పార్టీ డకౌట్ కాబోతుంది, కాంగ్రెస్ రనౌట్ అవబోతుంది”, అని పేర్కొన్నట్టు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వీడియో, ఆడియోని ఎడిట్ చేసి రూపొంధించిన ఒక ఫేక్ వీడియో అని కౌశిక్ రెడ్డి తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా స్పష్టం చేశారు. అసలైన వీడియోలోని ఆడియోని ఎడిట్ చేసి పోస్టులో షేర్ చేసిన వీడియోని రూపొందించారని పైవివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, హుజూరాబాద్ BRS అభ్యర్ధి కౌశిక్ రెడ్డి వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో BJP సెంచరీ కొడుతుందని వ్యాఖ్యలు చేసినట్టుగా షేర్ చేస్తున్న ఈ వీడియో ఎడిట్ చేసినది.

Share.

About Author

Comments are closed.

scroll