“గోమూత్రం లో ‘కరోనా’ వైరస్ ని నియంత్రించే ఔషధాలు మా శాస్త్రవేత్తలు గుర్తించారు.. సరిపడా గోమూత్రాన్ని ఇండియా నుండి దిగుమతి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం” అని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నాడని సోషల్ మీడియా లో చాలా మంది చెప్తున్నారు. అందులో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: గోమూత్రం లో ‘కొరోనా’ వైరస్ ని నియంత్రించే ఔషధాలను తమ శాస్త్రవేత్తలు గుర్తించారని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నాడు.
ఫాక్ట్ (నిజం): చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గోమూత్రం లో ‘కొరోనా’ వైరస్ ని నియంత్రించే ఔషధాలను తమ శాస్త్రవేత్తలు గుర్తించారని ఎక్కడా కూడా పేర్కొనలేదు. ‘కొరోనా’ వైరస్ నిరోధనకి గానీ, చికిత్సకి గానీ ఇప్పటివరకు ఎటువంటి ఔషధం లేదు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ‘కొరోనా’ వైరస్ ని నియంత్రించే ఔషధాలను తమ శాస్త్రవేత్తలు గోమూత్రం లో గుర్తించారని ఎక్కడైనా పేర్కొన్నాడా అని వెతికినప్పుడు, దాన్ని ధ్రువీకరిస్తూ ఎటువంటి సమాచారం లభించలేదు. ఒక వేల జిన్ పింగ్ నిజంగానే అటువంటి వ్యాఖ్యలు చేసినట్లయితే, దేశం లోని అన్ని ప్రముఖ వార్తా పత్రికలు మరియు మీడియా సంస్థలు దాని గురించి ప్రచురించేవి. కానీ, అటువంటి న్యూస్ ఎవరు కూడా ప్రచురించలేదు. ‘కొరోనా’ వైరస్ నిరోధనకి గానీ, చికిత్సకి గానీ ఇప్పటివరకు ఎటువంటి ఔషధం లేదని ‘World Health Organisation’ వారి వెబ్సైటు ద్వారా తెలుస్తుంది.
చివరగా, గోమూత్రంలో ‘కొరోనా’ వైరస్ ని నియంత్రించే ఔషధాలను శాస్త్రవేత్తలు గుర్తించినట్లుగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పేర్కొనలేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?