Fake News, Telugu
 

వాట్సాప్ ఫ్రోఫైల్ ఫోటో తమది పెట్టుకున్న వారు తొందరగా మార్చుకోండని వాట్సాప్ CEO సూచించలేదు

0

సోషల్  మీడియా లో ఒక మెసేజ్ చాలా ప్రచారం అవుతోంది. ఆ మెసేజ్ లో వాట్సాప్ ఫ్రోఫైల్ ఫోటో తమది పెట్టుకున్న వారు వీలైనంత తొందరగా మార్చుకోమని చెప్తూ, ISIS వారు తమ టెర్రరిస్ట్ కార్య కలాపాలకు వాటిని హాక్ చేసి దుర్వినియోగం చేసే అవకాశం ఉందని వాట్సాప్ సంస్థ CEO సూచించినట్లుగా ఉంది. ఆ మెసేజ్ ఢిల్లీ కమీషనర్ ఏకే మిట్టల్ (ఐపీఎస్) జారీ చేసినట్లుగా ఉంది. ఆ మెసేజ్ లో ఉన్నది ఎంతవరకు వాస్తవమో చూద్దాం. 

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వాట్సాప్ ఫ్రోఫైల్ ఫోటో తమది పెట్టుకున్న వారు వీలైనంత తొందరగా మార్చుకోండని వాట్సాప్ సంస్థ CEO సూచించారని ఢిల్లీ కమీషనర్ ఏకే మిట్టల్ (ఐపీఎస్) ఒక మెసేజ్ జారీ చేశారు. 

ఫాక్ట్ (నిజం): పోస్టులో ఉన్నది ఫేక్ మెసేజ్. వాట్సాప్ ఫ్రోఫైల్ ఫోటో తమది పెట్టుకున్న వారు మార్చుకోవలసిందిగా వాట్సాప్ సంస్థ CEO సూచించలేదు. అంతేకాదు, ఏకే మిట్టల్ పేరుతో ఇప్పటి వరకు ఢిల్లీ కమీషనర్ ఎవరూ పని చేయలేదు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

పోస్టులో చెప్పినట్లుగా వాట్సాప్ సంస్థ CEO ఏమైనా సూచించారా అని వెతికినప్పుడు, దాన్ని ధృవీకరిస్తూ ఎటువంటి సమాచారం లభించలేదు. ఆ మెసేజ్ లోని విషయాన్ని ఢిల్లీ కమీషనర్ ఏకే మిట్టల్ (ఐపీఎస్) ఒక సలహా రూపంలో జారీ చేసినట్లుగా ఉంది. కానీ, ఆ పేరు కలిగిన వ్యక్తి ఢిల్లీకి కమీషనర్ గా ఇప్పటివరకు పని చేయలేదని ఢిల్లీ పోలీస్ వారి వెబ్సైట్ ద్వారా తెలుస్తుంది. మెసేజ్ లో ఉన్న ఫోన్ నెంబర్ 9849436632 ని ట్రూకాలర్ యాప్ లో డైల్ చేసి చూసినప్పుడూ, అది ‘అర్షద్ అలీ’ అనే ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వ్యక్తిదిగా గుర్తించబడింది మరియు దానిని ‘స్పామ్’ అని మార్క్ చేసినట్లుగా తెలిసింది. కావున, అది ఒక ఫేక్ మెసేజ్. ఇదే మెసేజ్ 2016 లో కూడా షేర్ అయినట్లుగా ఇక్కడ చూడవచ్చు.

చివరగా, వాట్సాప్ ఫ్రోఫైల్ ఫోటో తమది పెట్టుకున్న వారు వీలైనంత తొందరగా మార్చుకోండి అని ఆ సంస్థ CEO సూచించలేదు మరియు ఏకే మిట్టల్ పేరుతో ఇప్పటి వరకు ఢిల్లీ కమీషనర్ ఎవరూ లేరు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll