Fake News, Telugu
 

చంద్రయాన్-2 లాంచ్ సమయంలో ప్రధాని మోదీ చప్పట్లు కొట్టిన వీడియోని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వీడియోతో ఎడిట్ చేసారు

0

ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రజలతో కలిసి పరుగెత్తిన వీడియోని టీ.వీ.లో చుస్తూ చప్పట్లు కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలోని నిజానిజాల్ని ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రజలతో పాటు పరిగెత్తిన దృశ్యాలని చూసి చప్పట్లు కొట్టిన ప్రధాని మోదీ.

ఫాక్ట్(నిజం): జులై 2019లో ప్రధాని మోదీ చంద్రయాన్-2 లాంచ్‌ని టీ.వీలో చూస్తూ చప్పట్లు కొట్టారు. ఆ వీడియోలో కనిపిస్తున్న రాకెట్ లాంచ్ దృశ్యాల చోట, రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్ర సమయంలో తాను ప్రజలతో కలిసి పరిగెత్తిన వీడియోని ఎడిట్ చేసి వైరల్ వీడియోని తయారు చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సమయంలో తెలంగాణాలోని గొల్లపల్లిలో ప్రజలతో కలిసి పరిగెత్తారు. వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు అనేక మీడియా చానెల్స్ యొక్క రిపోర్ట్స్ లో లభించాయి, వాటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఈ దృశ్యాలను చూస్తూ ప్రధాని మోదీ చెప్పట్లు కొట్టినట్లు ఉన్న వైరల్ వీడియోలో ఎంత నిజం ఉందో అని తగిన కీ వర్డ్స్ తోటి ఇంటర్నెట్‌లో వెతకగా నరేంద్ర మోదీ చంద్రయాన్-2 రాకెట్ లాంచ్‌ని టీ.వీలో చూస్తూ హర్షిస్తున్న వీడియో లభించింది. ఇదే వీడియోని జులై  2019లో అనేక న్యూస్ ఛానళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేసారు, వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలో టి.విలో కనిపిస్తున్న చంద్రయాన్ లాంచ్ దృశ్యాల చోట రాహుల్ గాంధీ భారత్ జోడో దృశ్యాలను పెట్టి వైరల్ వీడియోని ఎడిట్ చేసారు.

చివరగా, చంద్రయాన్-2 లాంచ్ సమయంలో ప్రధాని మోదీ చప్పట్లు కొట్టిన వీడియోని, ఆయన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర యొక్క వీడియోని చూస్తున్నట్లు ఎడిట్ చేసారు.

Share.

About Author

Comments are closed.

scroll